Begin typing your search above and press return to search.

RX 100 హిందీ రైట్స్ కు భలే ఆఫర్

By:  Tupaki Desk   |   25 Sept 2018 12:17 PM IST
RX 100 హిందీ రైట్స్ కు భలే ఆఫర్
X
స్మాల్ బడ్జెట్ ఫిలిం గా కొత్తవారితో తెరకెక్కిన 'RX 100' తెలుగులో సంచలన విజయం సాధించి నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషల ఫిలిం మేకర్స్ లో పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాను తమిళ రీమేక్ రైట్స్ డీల్ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ ఆది పినిశెట్టి హీరో గా తెరకెక్కనుంది.

తాజాగా ఈ సినిమా కన్నడ..హిందీ రీమేక్ రైట్స్ డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయని సమాచారం. కన్నడ రీమేక్ రైట్స్ రూ. 40 లక్షలకు అమ్ముడుపోయాయి. ఇక హిందీ విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడయడ్వాలా 'RX 100' రైట్స్ ను రూ.1.5 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకున్నాడట. ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారానే విషయం ఇంకా బయటకు రాలేదుగానీ లీడ్ యాక్టర్స్ గా పాపులర్ స్టార్స్ ను తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నాడట.

థియేట్రికల్ రన్ ద్వారానే బడ్జెట్ కు ఐదు రెట్ల కలెక్షన్స్ తీసుకొచ్చిన 'RX 100' రీమేక్స్ రైట్స్ రూపంలో ఫిలిం మేకర్స్ కు మరింత లాభాన్ని తీసుకొస్తోంది. మరి ఇతర భాషల రీమేకులు తెలుగు వెర్షన్ లాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా లేదా వేచి చూడాలి.