Begin typing your search above and press return to search.

వీడియో: లేడీ ఆఫీస‌ర్ స‌యామీ విరుచుకుప‌డుతోందిగా

By:  Tupaki Desk   |   7 March 2021 1:59 PM GMT
వీడియో: లేడీ ఆఫీస‌ర్ స‌యామీ విరుచుకుప‌డుతోందిగా
X
వైవియ‌స్ చౌద‌రి రేయ్ అనే సినిమాతో స‌యామీ ఖేర్ ని తెర‌కు ప‌రిచ‌యం చేశారు. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ అమ్మ‌డు క‌నిపించ‌లేదు. మిర్జియా- చోక్డ్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. కానీ అక్క‌డా బిగ్ బ్రేక్ లేదు.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ లో న‌టిస్తోంది. ఇందులో డేరింగ్ లేడీ ఆఫీస‌ర్ గా ఆప‌రేష‌న్ లో పాల్గొనే గ‌ట్సీ బ్యూటీగా న‌టిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన‌ స‌యామీ మేకింగ్ వీడియో గుబులు రేపుతోంది. స‌యామీ రియ‌ల్ స్టంట్స్ తో అద‌ర‌గొట్టేస్తోంది.

12 వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు వైల్డ్ డాగ్ ట్రైలర్ విడుద‌ల‌వుతుందని ప్రకటించడానికి మేకర్స్ ఈ సాయంత్రం ప్రత్యేక పోస్టర్ ‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 2 న విడుదల కానుంది.

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ‌ను కదిలించిన ఉగ్రవాద దాడుల ఆధారంగా వైల్డ్ డాగ్ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజాతో పాటు బాలీవుడ్ నటీమణులు దియా మీర్జా కూడా ఉన్నారు. తొలి అహిషర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నిరంజన్ రెడ్డి దీనిని మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.