Begin typing your search above and press return to search.

అందంతో సయ్యాటలు ఆడిస్తోందిగా

By:  Tupaki Desk   |   5 Jan 2017 7:55 AM GMT
అందంతో సయ్యాటలు ఆడిస్తోందిగా
X
సయామీ ఖేర్.. టాలీవుడ్ జనాలకు ఈ భామతో అంత పెద్దగా పరిచయాలు లేవు కానీ.. సినీ అరంగేట్రం మాత్రం టాలీవుడ్ నుంచే చేసింది ఈ బ్యూటీ. 'రేయ్' మూవీలో సాయిధరం తేజ్ తో కలిపి ఈమెను తెలుగు తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఈ దర్శకుడు పరిచయం చేస్తున్నాడంటే.. ఇలియానా లెవెల్లో ఇరగదీస్తుందని అంతా అనుకున్నారు కానీ.. పాపం ఆ లెక్క తప్పింది. బాలీవుడ్ లో అయినా పాస్ మార్కులు వేయించుకుంటుందనుకుంటే.. అక్కడ మరీ దారుణం.

35 కోట్లు పెట్టి అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ హీరోగా సినిమా తీస్తే.. కోటిన్నర మాత్రమే వసూలు చేయగలిగింది. ఇదంతా అమ్మడి అదృష్టానికి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక సినిమాల్లో ఛాన్సులు కావాలన్నా.. బాలీవుడ్ లో అవకాశాలు రావాలన్నా.. ఫోటో షూట్సే గతి. అందుకే జీక్యూ మేగజైన్ రీసెంట్ ఎడిషన్ కు అమ్మడు ఇచ్చిన పోజులు చూస్తే.. పిచ్చెక్కిపోవాల్సిందే. ఎక్స్ పోజింగ్ అనే పదానికి అబ్రివేషన్ కనిపెడుతోందా అన్నట్లుగా రెచ్చిపోయి మరీ వంపులన్నీ చూపించింది సయామీ.

అందంతో సయ్యాటలు ఆడుతూ అమ్మడు ఇచ్చిన ఫోటోలకు పరమార్ధం.. అవకాశాల కోసం వెతుకులాట అని చెప్పాల్సిన పని లేదు. అయితే.. సొగసులు చూపించడంలో తన స్థాయి ఏంటో మాత్రం ఈ సయ్యాటతో బాగానే చెప్పింది సయామీ ఖేర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/