Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి చెల్లి.. ఆ సినిమాతోనే ఎంట్రీ!

By:  Tupaki Desk   |   14 March 2021 2:10 PM GMT
హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి చెల్లి.. ఆ సినిమాతోనే ఎంట్రీ!
X
నేచుర‌ల్ బ్యూటీగా.. అందం, అభిన‌యంతో సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది సాయిప‌ల్ల‌వి. ద‌క్షిణాదిలోని అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఇప్పుడు సాయిప‌ల్ల‌వి హ‌వా కొన‌సాగుతోంది. అయితే.. ఇదే మంచి స‌మ‌యం అని భావిస్తున్న ఆమె.. త‌న సోద‌రిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధమైంది.

సాయిప‌ల్ల‌వి సోద‌రి పూజా క‌న్న‌న్ త్వ‌ర‌లోనే కోలీవుడ్ లో తెరంగేట్రం చేయ‌బోతోంది. ఇప్ప‌టికే త‌న డెబ్యూ మూవీకి సంతకం కూడా చేసింది పూజా. ఫేమ‌స్ స్టంట్ మాస్ట‌ర్ సెల్వా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ద్వారా వెండి తెర‌కు ప‌రిచయం కాబోతోందీ భామ‌.

కాగా.. ఐదేళ్ల క్రితం ఓ షార్ట్ ఫిల్మ్ లో న‌టించిన పూజా.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే ‘త‌లైవి’ ఫేమ్ విజ‌య్ అందించ‌నున్నారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సముద్రఖని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇత‌ర‌ వివ‌రాలు త్వ‌ర‌లో అధికారికంగా వెల్ల‌డికానున్నాయి.