Begin typing your search above and press return to search.

సాయిపల్లవి డూప్​ కాదు.. చెల్లెలు..!

By:  Tupaki Desk   |   14 March 2021 11:56 AM GMT
సాయిపల్లవి డూప్​ కాదు.. చెల్లెలు..!
X
సాయి పల్లవి ఈ పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకులు ‘ఫిదా’ అయిపోతారు. ఆమె డ్యాన్స్​, హావభావాలు, నటన తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయిపల్లవి ఎంపిక చేసిన చిత్రాలు మాత్రమే చేస్తున్నది. అవకాశం వచ్చింది.. కదా అని ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకోదు. ఎంతటి హీరో వున్నా సరే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తుంది. గ్లామర్​ పాత్రలు కాకుండా.. కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఒప్పుకుంటున్నది.

ఫిదా సినిమాలో సాయిపల్లవి నటించిన ‘వచ్చిందే మెల్లా మెల్లగ వచ్చిందే ’ పాట రికార్డులను కొల్లగొట్టింది. శేఖర్​ కమ్ముల డైరెక్షన్​ లో వచ్చిన ఫిదా చిత్రం భారీ హిట్​ అందుకున్నది. మళ్లీ అదే డైరెక్టర్​తో కలిసి ‘లవ్​స్టోరీ’ అనే సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలోని ‘సారంగదరియా’ అనే పాట యూట్యూబ్ లో విడుదలై రికార్డులు కొల్లగొడుతున్నది.

ఇదిలా ఉంటే సాయిపల్లవి చెల్లెలు పూజా కణ్ణన్ కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. పుజా చూడటానికి అచ్చం సాయిపల్లవి లాగానే ఉంది. ఇద్దరిని కవలలుగా భావిస్తూ వుంటారు. డ్యాన్స్​ కూడా బాగా చేస్తుందని టాక్​. పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసిన స్టంట్‌ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా పూజా కణ్ణన్‌ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ కథ, స్క్రీన్ ప్లే అందజేస్తున్నారు. ఆయన దగ్గర పూజా గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసింది. విజయ్ డైరెక్షన్ లో సాయి పల్లవి కణం అనే మూవీలో కూడా నటించింది. ఐదేళ్ల క్రితం ‘కారా’ అనే షార్ట్‌ ఫిలింలో నటించారు పూజ. అక్క లాగా చెల్లెలు పూజ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తుందో లేదో? వేచి చూడాలి.