Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి జీవితంలో అరుదైన క్ష‌ణాలు!

By:  Tupaki Desk   |   12 Oct 2022 4:34 AM GMT
సాయి ప‌ల్ల‌వి జీవితంలో అరుదైన క్ష‌ణాలు!
X
న‌ల్ల జాతి మ‌గువ నృత్యం చేసే భంగిమ‌తో ఏదైనా ఒక విగ్ర‌హాన్ని ఎక్క‌దైనా చూశారా? అంటే .. వెంట‌నే ఫిలింఫేర్ ప్ర‌తిమ‌ను గుర్తు చేసుకుంటాం. అది ప్ర‌తియేటా స్టార్ల ఆనందోత్సాహాల న‌డుమ వారి ముద్దుల జ‌డివాన‌లో త‌డుస్తూ ఉంటుంది.

త‌మ గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌కు ద‌క్కే అరుదైన గౌర‌వంగా భావించి ప్ర‌తిష్ఠాత్మ‌క ఫిలింఫేర్ అవార్డు ప్ర‌తిమను త‌మ‌తో తీసుకుని వెళుతుంటారు. ఇప్పుడు సాయిప‌ల్లవి కూడా డ‌బుల్ జాక్ పాట్ కొట్టింది. ఒక‌టి కాదు.. ఏకంగా రెండు ప్ర‌తిమ‌ల‌ను ఫిలింఫేర్ నుంచి అందుకుంది. వాటితో ప‌ల్ల‌వి దిగిన ఫోటోలు ఇప్పుడు వెబ్ లో వైర‌ల్ గా మారాయి.

ఫిలింఫేర్ చాలా సంవత్సరాలుగా అత్యంత ప్రతిభావంతులైన అర్హులైన కళాకారులకు అవార్డులను అందజేస్తోంది. క‌చ్ఛితంగా సాయిప‌ల్ల‌వి అందుకు పూర్తిగా అర్హురాలు.. 2022లో శ్యాంసింఘ‌రాయ్- ల‌వ్ స్టోరి చిత్రాల్లో న‌టించిన సాయిప‌ల్ల‌వి ఈ రెండు చిత్రాల్లో త‌న న‌ట‌న‌కు గాను ఇలా రెండు ఫిలింఫేర్ ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

ఈ ఆనందోత‌సాహంలో తన ద‌ర్శ‌క‌నిర్మాతలకు ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సాయిప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ అయ్యింది. ఫిలింఫేర్ నుండి వచ్చిన రెండు విగ్రహాలతో ముందుగా ప‌ల్ల‌వి పోజులిచ్చింది. ''ఇలాంటి రోజులు తరచుగా జరగవు! ఒకే సంవత్సరం రెండు చిత్రాలకు ప్రశంసలు అందుకోవడం.. ఇది చాలా ప్రత్యేకం!'' అంటూ మురిసిపోయింది.

ఆయా పాత్ర‌ల్లో త‌న న‌ట‌న‌కు లభించిన అపారమైన ప్రేమకు నేను కృతజ్ఞురాలిని... ఇలాంటి అందమైన పాత్రలను నేను మరెన్నో పొందాల‌ని ప్రార్థిస్తున్నాను'' అని తెలిపారు. #రాహుల్ సాంకృత్యన్ #వెంకట్ గారు #సునీల్ నారంగ్ గారు & #లవ్ స్టోరీ టీమ్స్ కి కృత‌జ్ఞ‌త‌లు అని హ్యాష్ ట్యాగ్ ల‌ను జోడించారు.

శ్యామ్ సింగ‌రాయ్ లో సాయిప‌ల్ల‌వి పాత్ర ఒక అద్భుతం. అలాగే ల‌వ్ స్టోరిలో ప‌ల్లెటూరి అమ్మాయిగా త‌న న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయ్యారు. సాయిప‌ల్ల‌వి ప్ర‌తిభ‌ను గుర్తించి ఇలా ఫిలింఫేర్ పుర‌స్కారాల‌ను అందించి గౌర‌వించింది.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.