Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ ల లిస్ట్‌ లో చేరిపోయిన సాయిపల్లవి

By:  Tupaki Desk   |   3 April 2021 3:30 PM GMT
ఆ హీరోయిన్‌ ల లిస్ట్‌ లో చేరిపోయిన సాయిపల్లవి
X
ఇండియన్‌ సినిమా చరిత్రలో ఎక్కువ శాతం హీరో ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి అలాగే ఎక్కువ విజయాలు కూడా అవే దక్కించుకున్నాయి. హీరోలకు మాత్రమే ఎక్కువ శాతం జనాలను థియేటర్లకు తీసుకు రాగల సత్తా ఉండేది. కాల క్రమేనా హీరోయిన్స్‌ కూడా జనాలను థియేటర్లకు రప్పించడంలో సత్తా చాటుతున్నారు. పలానా హీరోయిన్‌ ఉంది అంటూ దర్శకుడు హీరో ఎవరు అనే విషయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులు వెళ్తున్నారు. ఆ ఘనత దక్కించుకున్న హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో సాయి పల్లవి కూడా చేరిపోయిందని చెప్పడంలో సందేహం లేదు.

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్‌ స్టోరీ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ మరియు కర్ణాటకలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చైతూ గత చిత్రాలు ఏవీ కూడా ఆ భాషల్లో ఆకట్టుకున్నది లేదు. లవ్‌ స్టోరీ సినిమా ను ఆ రెండు భాషల్లో కేవలం సాయి పల్లవి ఉంది అనే నమ్మకంతోనే డబ్బింగ్‌ చేస్తున్నారు. సాయి పల్లవి కి అక్కడ మంచి మార్కెట్‌ ఉంది. అందుకే ఆమె కోసం అయినా జనాలు వస్తారనే ఉద్దేశ్యంతో అక్కడ డబ్బింగ్ కు సిద్దం అయ్యారు.

సాయి పల్లవి తెలుగు లో కూడా మంచి స్టార్‌ డంను దక్కించుకుంది. చైతూ కు ఉన్న ఇమేజ్ తో పాటు సాయి పల్లవి క్రేజ్ కూడా లవ్‌ స్టోరీకి కలిసి వచ్చి భారీ బిజినెస్ చేసింది. మొత్తంగా లవ్‌ స్టోరీకి సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా నిలవడం వల్ల రెగ్యులర్ కంటే ఎక్కువ బిజినెస్ అయ్యింది. అందుకే సాయి పల్లవి ఆ స్పెషల్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిందని అంటున్నారు.