Begin typing your search above and press return to search.
సైనా ట్రైలర్ టాక్: మహిళలకు స్ఫూర్తి బాటలు పరుస్తానంటున్న ప్లేయర్!
By: Tupaki Desk | 8 March 2021 6:09 PM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ అనేవి కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఏడాది ఎంతోమంది సామాన్య ప్రజలను మోటివేట్ చేసిన గ్రేట్ పర్సనాలిటీల జీవితాలను తెరమీద ఆవిష్కరిస్తున్నారు. అందులో శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలతో పాటు క్రీడాకారుల బయోపిక్స్ కూడా వస్తున్నాయి. ఇదివరకే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్ లాంటి గొప్ప బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సైనా బయోపిక్ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు మేకర్స్. స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా సైనా టైటిల్ పాత్రలో నటించింది. ఈ ట్రైలర్ చూస్తే సైనా జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుండి ఆమె సాధించిన గెలుపు వరకు చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.
ఈ సినిమాకు అమోల్ గుప్తే దర్శకత్వం వహించగా.. అమాల్ మాలిక్ సంగీతం అందించాడు. మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సైనా పాత్రలో నటించిన పరిణీతి చోప్రా.. ఆ పాత్రలో ప్రజలు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయంలో ఉన్నట్లు తెలిపింది. అయినా పోస్టర్స్ క్రియేట్ చేసిన బజ్ కి తను హ్యాపీగానే ఉందని చెప్పింది పరిణితి. ప్రపంచం నలుమూలల నుండి పొందుతున్న ప్రేమలో మునిగిపోయాను. ఈ చిత్రం ప్రతి స్త్రీలో దాగి ఉన్న అంతులేని ఆత్మ సంఘర్షన అంటూ చెప్పింది. ట్రైలర్ ద్వారా సైనా దేశంలోని మిలియన్స్ ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చింది. ఈరోజుల్లో మహిళల బలాన్ని సూచించేందుకు మైలురాయిగా నిలిచింది అనే విధంగా చూపించారు. అయితే ఈ సినిమాను టి-సిరీస్ భూషణ్ కుమార్, కృషన్ కుమార్, సుజాయ్ జైరాజ్, రాసేష్ షా సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.