Begin typing your search above and press return to search.

షాకిచ్చిన సైనా.. గ్లామర్ 'షో' సంచలనం

By:  Tupaki Desk   |   8 Feb 2020 12:00 PM IST
షాకిచ్చిన సైనా.. గ్లామర్ షో సంచలనం
X
సెలబ్రిటీలు అందరూ ఒకేలాంటి ఇమేజ్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటారు. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ కమ్ హైదరాబాదీ సైనా నెహ్వాల్ అన్నంతనే.. డీసెంట్ గా ఉండటంతో పాటు ..అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ సీరియస్ క్రీడాకారిణిగా పేరుంది. అలాంటి సైనా తాజాగా చేసిన ఒక ఫోటో షూట్ ఆసక్తికరంగానే కాదు.. షాకింగ్ గా మారింది.

తమ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన గ్లామర్ ను పంచేస్తూ.. ఆమె చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాట్ గా హాట్ గా ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలు చూస్తే.. సైనా ఏమైనా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారా? అన్న సందేహం కలిగేలా ఫోజులు ఉన్నాయి. క్రీడాకారిణిగా సుపరిచితమైనా.. ఎప్పుడూ తన ఆటతోనే కానీ.. గ్లామర్ లుక్ తన మీద పడకుండా జాగ్రత్త పడిన సైనా.. ఇప్పుడు అందుకు భిన్నంగా చెలరేగిపోతూ చేసిన వోగ్ ఫోటో షూట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఒక ఫోటోలో అయితే.. క్లీవేజ్ షో ఇచ్చిన సైనా.. మరో ఫోటోలో కనిపించి.. కనిపించని రీతిలో క్లీవేజ్ షో చేసిన వైనంతో కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. తాను చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన హాట్ ఫోటోల్ని సైనా తన ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసింది. పలువురు అభిమానులు ఆమె ఫోటోలకు ఫిదా అయిపోతుంటే.. మరికొందరు మాత్రం.. ఏమైంది సైనా నీకు? అని ప్రశ్నిస్తుండటం గమనార్హం.

అటను పక్కన పెట్టి.. గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో సైనా ఉన్నారా? అన్న ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కొద్ది నెలల క్రితమే బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ను ప్రేమవివాహం చేసుకున్న సైనా.. బీజేపీలో చేరటం వార్తాంశంగా మారితే.. తాజా ఫోటో షూట్ ఆమెలోని మరో కోణాన్ని బయటకు తెచ్చిందంటున్నారు.