Begin typing your search above and press return to search.

సైనా నెహ్వాల్ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   28 Feb 2021 7:00 AM IST
సైనా నెహ్వాల్ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్
X
చాలా కాలం త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన జోష్ లో ఉంది పరిణీతి చోప్రా. ఏ గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రంలో త‌న న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్క‌డ‌మే గాక ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించ‌డం త‌న కెరీర్ కి కీల‌క మ‌లుపు అని చెప్పాలి.

ఇక ఇదే హుషారులో త‌దుప‌రి పెండింగ్ సినిమాల‌పైనా ప‌రిణీతి దృష్టి సారించింది. తాజాగా బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ రిలీజ్ తేదీని ప‌రిణీతి అండ్ టీమ్ ప్ర‌క‌టించారు. ప‌రిణీతి టైటిల్ పాత్ర పోషించిన ఈ బ‌యోపిక్ మార్చి 26 న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

పరిణీతి చోప్రా చాలా కాలంగా ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్ లో పాల్గొంటోంది. అమోల్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే మారిన స‌న్నివేశంలో అతి త్వరలో థియేటర్ల‌లో విడుద‌ల చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

100% ఆక్యుపెన్సీలో సినిమా హాళ్ళను కొన‌సాగించ‌డానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సైనా సినిమాను పెద్ద తెరపైకి తీసుకురావడం ఉత్తమం అని నిర్మాతలు భావించారు. మార్చి 26 లేదా ఏప్రిల్ 9 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారని.. ఇప్పుడు మార్చి 26 కి ఫిక్స‌యిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది.నిజానికి ముంబై సాగా లాంటి క్రేజీ మూవీతో పాటు.. సైనా మూవీ కూడా మొదట్లో డిజిటల్ ప్లాట్ ‌ఫామ్‌లలో విడుదల చేయాలని భావించినా చివరికి థియేట్రికల్ రిలీజ్ మార్గాన్ని ఎంచుకోవ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.

దీంతో ఈ ఏడాది ప‌రిణీతికి మూడు బ్యాక్-టు-బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ ల‌కు ఆస్కారం క‌లిగింది. సందీప్ పిర్ పింకీ ఫర్రార్ చిత్రం మార్చి 19 న విడుదల కానుండగా.. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఫిబ్రవరి 26 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇప్పుడు రేసులోకి మూడో చిత్రం వ‌చ్చి చేరింది.