Begin typing your search above and press return to search.
ఓటీటీకి సిద్దమైన 'సైనా'
By: Tupaki Desk | 28 Jan 2021 12:00 PM ISTఈమద్య కాలంలో బాలీవుడ్ మరియు ఇతర భాషల సినిమా పరిశ్రమల్లో బయోపిక్ ల సీజన్ కొనసాగుతుంది. ప్రముఖుల బయోపిక్ లు ప్రస్తుతం జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వరుసగా వస్తున్న సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్రీడా రంగం, సినీ రంగం, రాజకీయ రంగ ప్రముఖులు మరియు శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోపిక్ లు వచ్చాయి. ఇదే దారిలో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్దం అయ్యింది.
గత ఏడాదిలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. పరిణితి చోప్రా ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో కనిపించబోతుంది. 'సైనా' టైటిల్ తో రూపొందిన ఈ బయోపిక్ ను ఇన్ని రోజులు థియేటర్ రిలీజ్ కు వెయిట్ చేశారు. కాని 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయిన కారణంగా మరీ ఆలస్యం చేయకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారట.