Begin typing your search above and press return to search.

నాగ్ ని మించిన చైతు!!

By:  Tupaki Desk   |   29 Sep 2018 7:59 AM GMT
నాగ్ ని మించిన చైతు!!
X
తండ్రి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కొడుకు తనను మించి ఏదైనా సాధించినప్పుడు కలిగే ఆనందం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అనుభూతిని సినిమా తండ్రులు ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటారు. నాగార్జున శివ నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసినప్పుడు నాగేశ్వర రావు గారు పొందిన ఆనందం అప్పటి ఇంటర్వ్యూలలో చూడొచ్చు. మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ పని పట్టినప్పుడల్లా కృష్ణ గారి సంతోషం మాములుగా ఉండదు. మరీ ఈ స్థాయిలో కాదు కానీ నాగార్జున కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నాడు. తక్కువ గ్యాప్ లో చైతు శైలజారెడ్డి అల్లుడు నాగార్జున దేవదాస్ విడుదల కావడం చూసాం.

ఓపెనింగ్స్ విషయంలో వ్యక్తిగతంగా ఎవరి కెరీర్ బెస్ట్ వాళ్ళు అందుకున్నా ఇద్దరిలో ఎవరు మిన్నగా వసూళ్లు రాబట్టారు అనేది అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం ఆసక్తి కలిగించేదే. కానీ ఆశ్చర్యంగా లెక్కలు మాత్రం చైతునే విజేతగా నిలబెడుతున్నాయి.

శైలజారెడ్డి అల్లుడు మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 5.7 కోట్ల షేర్ తో ప్రపంచవ్యాప్తంగా 6.95 కోట్ల షేర్ తో చైతు టాప్ వన్ గా నిలిచింది. దేవదాస్ ని చూసుకుంటే మొదటి రోజు 4.67 కోట్ల ఏపీ తెలంగాణ షేర్ తో కలుపుకుని వరల్డ్ వైడ్ మొత్తం 6.57 కోట్ల దాకా రాబట్టింది. మార్జిన్ తక్కువగా అనిపిస్తున్నా చైతు ఫిగర్స్ ఎక్కువగా ఉన్నాయి.

చైతు లోకల్ గా ఆడుకోగా నాని సహాయంతో నాగ్ ఓవర్ సీస్ లో బాగానే రాబట్టాడు. ఇది నాగ్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాకతాళీయంగా రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ రాబట్టుకోవడం విశేషం. ఇందులో ఏది ఫైనల్ గా కమర్షియల్ గా బెటర్ మూవీగా నిలుస్తుంది అనేది ఫుల్ రన్ అయ్యాకే తేలుతుంది. పోటీ అనేది తండ్రి కొడుకుల మధ్యే కాబట్టి ఎవరు గెలిచినా అభిమానులకు ఒకటే.