Begin typing your search above and press return to search.

కన్నీరు పెట్టించిన స్టార్‌ నటుడి సినీ కష్టాలు

By:  Tupaki Desk   |   30 July 2020 12:00 PM IST
కన్నీరు పెట్టించిన స్టార్‌ నటుడి సినీ కష్టాలు
X
టాలీవుడ్‌ కోలీవుడ్‌ తో పాటు కన్నడంలో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సాయి కుమార్‌. ఆయన తండ్రి తమ్ముడు తనయుడు అంతా కూడా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. వెండి తెర మరియు బుల్లి తెరపై ఇప్పటికి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్న సాయి కుమార్‌ తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను షేర్‌ చేసుకుని అభిమానులు కన్నీరు పెట్టుకునేలా చేశాడు. ఒక కార్యక్రమంలో భాగంగా గతంలో తాను నటించిన ‘ఈశ్వర్‌ అల్లా’ అనే చిత్రం గురించి వెళ్లడి చేశాడు.

కెరీర్‌ లో నిలదొక్కుకుంటున్న సమయంలో తన తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో నాన్న విలన్‌ గా నేను హీరోగా ఒక సినిమాను నిర్మించాము. ఆ సినిమాను అప్పట్లోనే రెండు కోట్ల బడ్జెట్‌ తో నిర్మించాము. రెండు కోట్ల బడ్జెట్‌ అంటే అప్పట్లో భారీ బడ్జెట్‌. కాని నేను నాన్న నటించిన సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుందనే ఉద్దేశ్యంతో అంత మొత్తంను ఖర్చు చేశాం. సినిమా చూసిన ఏ ఒక్క బయర్‌ కూడా సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.

సినిమా క్లైమాక్స్‌ లో విలన్‌ అయిన నాన్నను నేను కొట్టాల్సి ఉంది. ఆ సీన్స్‌ ప్రేక్షకులు తిరష్కరిస్తారని బయ్యర్లు భావించారు. దాంతో కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు. దాసరి నారాయణ రావు గారి సహకారంతో సినిమాను ఏదోలా విడుదల చేశాం. బయ్యర్లు అనుకున్నట్లుగానే పరిస్థితి తలకిందులు అయ్యింది. ప్రేక్షకులు ఈశ్వర్‌ అల్లా సినిమాను తిరష్కరించారు. దాంతో రెండు కోట్ల అప్పులు మిగిలి రోడ్డున పడ్డాము. ఆ సినిమా అప్పులను తీర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను ఆ అప్పులను తీర్చేందుకు ఏకంగా 15 సినిమాలను చేయాల్సి వచ్చింది. ఆ పదిహేను సినిమాల పారితోషికంతో అప్పులు తీర్చానంటూ సాయి కుమార్‌ ఎమోషనల్‌ అయ్యాడు.