Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: రావ‌ణ్ వార‌సుడి రంగ ప్ర‌వేశం?

By:  Tupaki Desk   |   30 Sep 2021 10:30 AM GMT
ట్రెండీ టాక్‌: రావ‌ణ్ వార‌సుడి రంగ ప్ర‌వేశం?
X
స్టార్ ల వార‌సుల‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసేందుకు స్టార్ డైరెక్ట‌ర్లు.. ప్రొడ్యూస‌ర్ లు ముందుకొస్తుంటారు. మ‌న తెలుగులో సి. అశ్వ‌నీద‌త్‌.. కె. రాఘ‌వేంద్ర‌రావు త‌ర‌హాలో.. బాలీవుడ్ లోనూ స్టార్ ల కిడ్స్ ని వెండితెర‌పై ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను కొన్నేళ్లుగా త‌న‌ భుజాల‌పై వేసుకున్నారు బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్‌. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌` మూవీతో వ‌రుణ్ ధావ‌న్‌.. అలియాభ‌ట్‌.. సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా...`ధ‌డ‌క్‌`తో జాన్వీ క‌పూర్‌.. ఇషాన్ క‌ట్ట‌ర్‌..ల‌ని ప‌రిచ‌యం చేశారు.

ఆ త‌రువాత `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2`తో అన‌న్య పాండే.. తారా సుతారియాల‌ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. ఇప్పుడు మ‌రో వార‌సుడి బాధ్య‌త‌ల్ని కూడా క‌ర‌ణ్ తీసుకున్నారు. అత‌డే సైఫ్ అలీఖాన్ వార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్‌. ఇత‌న్ని త్వ‌ర‌లో హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని క‌ర‌న్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్ప‌డు ఇదే హాట్ టాపిక్‌. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ ఇప్ప‌టికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు ఇబ్ర‌హీం హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. సైఫ్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ 3డిలో రావ‌ణ్ పాత్ర‌ను పోషిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భాస్ అభిమానుల్లోనూ అత‌డి వార‌సుని ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్`.. ర‌ణ్ వీర్ సింగ్ `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ` చిత్రాలతో బిజీగా వున్నారు. ఇవి పూర్త‌యిన త‌రువాతే క‌ర‌ణ్ .. సైఫ్ వార‌సుడు ఇబ్ర‌హీంని ఇంట్ర‌డ్యూస్ చేయ‌బోతున్నార‌ట‌. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇబ్ర‌హీమ్ ని జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌రిచ‌యం చేయ‌బోతున్నారా? అన్న‌దానికి క‌ర‌ణ్ క్లారిటీనివ్వాల్సి ఉంది. ఇటీవ‌ల జోయా అక్త‌ర్ ఓ వెబ్ సిరీస్ తో ఇబ్ర‌హీం ని ప‌రిచ‌యం చేస్తార‌ని క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఖాన్ డాట‌ర్ సుహానా.. శ్రీ‌దేవి రెండో కూతురు సినీఎంట్రీ

కింగ్ ఖాన్ షారూక్ వార‌సురాలు.. శ్రీ‌దేవి రెండో త‌న‌య ఖుషీ.. సైఫ్ కుమారుడు ఇబ్ర‌హీం ఆరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. వీరంతా ఒకే సిరీస్ తో డెబ్యూలుగా ఎంట్రీ ఇస్తార‌ని.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ రూపొందించ‌నున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ తో ప‌రిచ‌య‌మ‌వుతార‌ని త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

సుహానాతో పాటు మ‌రో ఇద్ద‌రు స్టార్ కిడ్స్ ని కూడా జోయా అక్త‌ర్ ఆడిష‌న్స్ చేసి ఎంపిక చేసుకున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి- బోనీ క‌పూర్ ల‌ రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జోయా అక్తర్ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా పాపుల‌రైన‌ ఆర్కిస్ కామిక్స్ ఆధారంగా దేశీ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జోయా ఇప్పటికీ తన దేశీ `ఆర్చీ`ని వెతుకుతూ.. అప్పటికే ఆమె బెట్టీ .. వెరోనికా పాత్ర‌ధారుల‌ను కనుగొన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ సిరీస్ లో ఖుషీ కపూర్ & సుహానా ఖాన్ ల‌ను వెరోనికా గా.. బెట్టీగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఆర్చీ పాత్ర‌లో ఇబ్రహీం అలీ ఖాన్ న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఈ సంవత్సరంలో ఇది గొప్ప కాస్టింగ్ ఎంపిక‌. ఇద్దరు స్టార్ డాట‌ర్స్ బాలీవుడ్ లో ఎప్పుడు లాంచ్ అవుతార‌నే దానిపై ఎప్పటినుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. నిజానికి జాన్వీని ధ‌డ‌క్ చిత్రంతో తెర‌కు ప‌రిచ‌యం చేసిన క‌ర‌ణ్ జోహార్ ఖుషీని కూడా ప‌రిచ‌యం చేస్తార‌ని భావించారు. కానీ ఇప్పుడు జోయాకు ఆ అవ‌కాశం వెళ్లింది.

నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి సంబంధించిన ఇతర వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. జోయా అక్తర్ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్ -అమృత సింగ్ కుమారుడు ఇబ్రహీం `ఆర్చీ` పాత్ర పోషించే బలమైన అవకాశం ఉండ‌గా.. ఖుషీ కి మంచి స్కోప్ దొరుకుతుంద‌ని ఊహాగానాలు ఇప్ప‌టికి సాగుతున్నాయి. వీటిని అధికారికం చేయాల్సిన‌ది జోయా లేదా క‌ర‌ణ్ జోహార్ అని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది.