Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' రావణుడు ప్రత్యేకమట!

By:  Tupaki Desk   |   4 Dec 2020 12:04 PM IST
ఆదిపురుష్‌ రావణుడు ప్రత్యేకమట!
X
ప్రభాస్‌ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్న 'ఆదిపురుష్‌' సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో భారీ ఎత్తున ఆసక్తి నెలకొంది. రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించబోతున్నాడు. రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా రావణుడు అంటే విలన్‌ అన్నట్లుగా చూపించారు. కాని ఈ సినిమాలో మాత్రం రావణుడిలోని మానవీయ కోణంను చూపించబోతున్నట్లుగా సైఫ్‌ అలీ ఖాన్‌ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు.

దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను కొత్త తరహా రామాయణంను చూపిస్తాడంటూ సైఫ్‌ చెప్పకనే చెప్పాడు. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ ను అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు. సినిమాను 2022 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా కోసం యావత్‌ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. విజువల్‌ వండర్‌ గా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సినిమా గురించి మరింతగా అంచనాలు పెంచుతున్నాయి.