Begin typing your search above and press return to search.

ఉండటానికి రెండున్నా ఒకటీ వాడ్డం లేదు

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:36 AM IST
ఉండటానికి రెండున్నా ఒకటీ వాడ్డం లేదు
X
సైఫ్ ఆలీఖాన్.. బాలీవుడ్ స్టార్ హీరో, కరీనా కపూర్ భర్త ఇలాంటి గుర్తింపులు చాలానే ఉన్నా... ఈ హీరోకి మరో రెండు బిరుదులు కూడా ఉన్నాయి. ఇతగాడు గ్వాలియర్ రాజ కుటుంబీకుల వారసుడు కావడంతో... నవాబ్ కూడా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ కూడా ప్రదానం చేసింది. అయితే.. ఈరెండు బిరుదులనూ ఉయోగించుకోవడానికి సైఫ్ చాలా ఇబ్బంది పడుతున్నాడట.

రాజ వంశస్థుడు కావడంతో స్వతహాగా నవాబ్ అయినా.. ఇప్పుడు రాజరికం లేదు. నేను కింగ్ ని అనుకోవడానికి లేదు. అలాగే నవాబులు ప్రజల కోసం సొంతసొమ్ములు ఖర్చు పెట్టి సేవలు చేశారు. సైఫ్ కి అలాంటి అలాంటి అలవాట్లు లేవు. ఈ కాలంలో కూడా నవాబులేంటండీ బాబూ అనేస్తాడు. అలాగే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నా.. దాన్ని తన పేరుముందు మాత్రం ఉపయోగించుకోవడం ఇబ్బందిగా ఉందట.

2012లో ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఎన్నారైని చితకబాదాడనే అభియోగం నడుస్తోంది సైఫ్ మీద. ఈ కేసులో ఇతగాడు ప్రధాన ముద్దాయి కూడా. అలాగే సల్మాన్ ఖాన్ పై ఉన్న వన్యమృగాల సంబంధిత కేసులోనూ... సైఫ్ పేరుంది. దీంతో ఈ బిరుదు కూడా ఉపయోగించుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడట. బాగుంది వరస... ఉండటానికి రెండున్నా.. వాడుకోడానికి ఒకటి కూడా పనికిరావడం లేదు. సైఫ్ ని చూసి జాలిపడ్డం తప్ప.. ప్రస్తుతానికి ఏం చేయలేం.