Begin typing your search above and press return to search.

కూతురు ఎంట్రీ.. విభేదాలు లేవ్

By:  Tupaki Desk   |   29 Jun 2017 12:35 PM GMT
కూతురు ఎంట్రీ.. విభేదాలు లేవ్
X
బాలీవుడ్ ఖాన్ త్రయం తర్వాత అంతడి డిమాండ్ ఉన్న మరో ఖాన్ హీరో సైఫ్ ఆలీ ఖాన్. ఇప్పటికీ సైఫ్ హీరోగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఈయన కూతురు సారా ఆలీ ఖాన్ కు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

రాబోయే కాలంలో కాబోయే స్టార్ హీరోయిన్ అని ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్లుగానే ఈ కుర్ర భామ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అయితే.. సారా సినిమా ఎంట్రీ గురించిన మాటలు వచ్చినపుడల్లా దాటేయడం పరిపాటి. రీసెంట్ గా అయితే.. సారాను హీరోయిన్ చేయడంపై.. ఆమె తల్లి తన మాజీ వైఫ్ అయిన అమృతా సింగ్ తో సైఫ్ ఆలీ ఖాన్ కు విబేధాలు వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. వీటన్నిటిపైనా రియాక్ట్ అయిన సైఫ్.. సారా తల్లిదండ్రులుగా తామిద్దరం ఆమె ఫ్యూచర్ పై ఒకే అభిప్రాయంతో ఉన్నామని.. ఎలాంటి విబేధాలు తమ మధ్య లేవని చెప్పాడు.

'నా కూతురు సారా సినిమాల్లో ప్రవేశించడంపై.. నేను అమృత ఇద్దరం ఒకటే ఉద్దేశ్యంతో ఉన్నాం. యాక్టింగ్ చేయాలనే ఆమె కోరికను నేను సపోర్ట్ చేశాను. ఇప్పటికే తనతో చర్చించాను. ఒక తండ్రిగా ఆమె సినిమా రంగ ప్రవేశంపై ఆసక్తితో పాటు, కొన్ని మిశ్రమ భావాలు ఉన్నా.. తన అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాను' అని చెప్పాడు సైఫ్ ఆలీ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/