Begin typing your search above and press return to search.

‘పటౌడీ ప్యాలెస్​’సైఫ్​ చేతుల్లోకి.. దాని కోసం ఎంత కట్టాడో తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   23 Oct 2020 8:30 AM IST
‘పటౌడీ ప్యాలెస్​’సైఫ్​ చేతుల్లోకి.. దాని కోసం ఎంత కట్టాడో తెలిస్తే షాకే
X
బాలీవుడ్ స్టార్​ హీరో సైఫ్​ అలీఖాన్​ ఓ డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన పూర్వీకుల రాజభవనాన్ని ఆయన రూ.800 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. సైఫ్​ అలీఖాన్​ పూర్వీకులు రాజవంశీకులన్న విషయం తెలిసిందే. వారికి ఓ భారీ భవనం ఉండేంది అదే హర్యానా రాష్ట్రంలోని గూర్గావ్​ జిల్లా పటౌడీ పట్టణంలోని ‘పటోడీ ప్యాలెస్​’. అయితే ఆ భారీ భవంతిని సైఫ్​ తండ్రి ప్రముఖ క్రికెటర్​ పటౌడీ నవాబ్​ మన్సూర్​ అలీఖాన్​.. నీమరనా హోటల్​ గ్రూప్​కు లీజ్​కు ఇచ్చాడు. నిజానికి ఆ రాజ భవంతి చాలా విలాసవంతంగా ఉంటుంది. ఆ భవంతి చుట్టూ ఎన్నో అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. సరస్సును తలపించే స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. ఆ భవంతి రాజసానికి ఓ ప్రతీక.

అందులో వాడిన కలప కొన్ని కోట్ల విలువైనది. అడుగడుగునా పూర్వీకులు, రాజవంశీకుల ఫొటోలు కనిపిస్తాయి. ఇప్పడు అక్కడ నివాసం ఉండేలా సర్వహక్కులు పొందాడు సైఫ్​ ఈ సందర్బంగా సైఫ్​ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఇది కేవలం ఓ చారిత్రక కట్టడం మాత్రమే కాదు. మా కుటుంబం ఆత్మ. ఇక్కడ నాకు ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి. నా తండ్రి ఈ భవనాన్ని ఓ హోటల్‌ గ్రూపునకు లీజుకు ఇచ్చారు. ఫ్రాన్సిస్‌, అమన్‌(హోటల్‌ నిర్వాహకులు) ఈ భవనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మా అమ్మ షర్మిలా ఠాగూర్‌కు అక్కడ ప్రత్యేకంగా ఓ కాటేజీ కూడా ఉంది.

అందరూ అనుకుంటున్నట్లుగా నేను ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేయలేదు. ఎందుకంటే మేం ఎప్పుడూ దానిని అమ్మలేదు. అది మా సొంతం. లీజుకు ఇచ్చాం అంతే’ అంటూ చెప్పుకోచ్చారు సైఫ్​. వందల ఏండ్ల క్రితం నాటి నుంచే మాకు అక్కడ భూమి ఉంది. అయితే మా తాతయ్య, మా బామ్మ మీద కోసం దాదాపు వందేళ్ల క్రితం ఈ భవనాన్ని కట్టించారు. సైఫ్‌ కొన్నిరోజుల క్రితం తన భార్యాపిల్లలు కరీనా కపూర్‌, తైమూన్‌ అలీఖాన్‌లతో కలిసి పటౌడీ ప్యాలెస్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు వారు అక్కడే గడిపి ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం కరీనా గర్భవతి అన్న సంగతి తెలిసిందే. సైఫ్‌ అలీఖాన్‌ కు సారా అలీఖాన్‌, ఇబ్రహీం అలీఖాన్‌ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య అమృతా సింగ్‌ ద్వారా కలిగిన సంతానం వీరు.