Begin typing your search above and press return to search.
పవన్ - బన్నీ సినిమాలలో 'దబాంగ్' బ్యూటీ..?
By: Tupaki Desk | 29 Dec 2020 11:50 AM ISTప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సైయీ మంజ్రేకర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' సినిమాతో సైయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. అయితే సౌత్ ఇండస్ట్రీ కాస్టింగ్ వర్గాల్లో మాత్రం ఈ బ్యూటీ పేరు బాగానే వినిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న 'మేజర్' సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సైయీ కీలక పాత్ర పోషిస్తోంది. అలానే మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో కూడా ఈ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇటీవలే జరిగిన సైయీ బర్త్ డే నాడు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం సైయీ మంజ్రేకర్ నటించిన తెలుగు సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకముందే అమ్మడికి మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయట. అల్లు అర్జున్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ తెరకెక్కబోయే చిత్రంలో ఈ బ్యూటీని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. బన్నీ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా సైయీ తీసుకోవాలని అనుకుంటున్నారట. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ చేసే సినిమాలో 'దబాంగ్' సుందరిని తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా టాక్. మరి ఈ బ్యూటీ తెలుగులో మరిన్ని క్రేజీ ఆఫర్స్ అందుకుని టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.