Begin typing your search above and press return to search.

మెగా హీరో కోసం దబాంగ్ 3 బ్యూటీ ఫిక్స్!

By:  Tupaki Desk   |   1 April 2020 3:30 AM GMT
మెగా హీరో కోసం దబాంగ్ 3 బ్యూటీ ఫిక్స్!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురిపేర్లు వినిపించాయి కానీ ఇంతవరకూ హీరోయిన్ మాత్రం ఫైనలైజ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వరుణ్ కు జోడీగా ఒక బాలీవుడ్ భామను తీసుకునే ఆలోచన లో ఉన్నారట.

సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'దబాంగ్ 3' లో హీరోయిన్ గా నటించిన సాయి మంజ్రేకర్ ను వరుణ్ సినిమాకు హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట. ప్రముఖ దర్శకుడు.. నటుడు అయిన మహేష్ మంజ్రేకర్ కూతురే ఈ సాయి మంజ్రేకర్. 'దబాంగ్ 3' సాయి మంజ్రేకర్ కు డెబ్యూ ఫిలిం. తొలి సినిమాతోనే సాయి మంజ్రేకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే వరుణ్ సరసన ఈ కొత్త బాలీవుడ్ బ్యూటీని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే హీరోయిన్ ఎంపిక విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు ముంబై హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి హిట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. మరి ఈ భామ కూడా కియారా అద్వాని తరహాలో సత్తా చాటుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే వరుణ్ తేజ్ సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.