Begin typing your search above and press return to search.

మెగా హీరోతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ భామ..!!

By:  Tupaki Desk   |   25 Dec 2020 2:30 AM GMT
మెగా హీరోతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ భామ..!!
X
మెగా ఫ్యామిలీ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్.. ఈ మధ్య సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది అంతరిక్షం, చివరిగా గడ్డలకొండ గణేష్, ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న బాక్సర్ సినిమాలను గమనిస్తే ఈజీగా అర్ధమవుతుంది. ఈ మెగా హీరో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు అని. ఇప్పుడిప్పుడే వరుణ్ తన కెరీర్ ని ఒక దారిలో సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక వరుణ్ చేస్తున్న ఈ కొత్త సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగనుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. ఇంతకుముందు అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్.. ఆ సినిమా టైంలోనే ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం.

బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. వరుణ్ అన్నివిధాలా అంటే శారీరకంగా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అల్లు బాబీ, ముద్ద సిద్దులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది నిన్నటి వరకు జవాబు లేని ప్రశ్న. ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ను ఓకే చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకే తెలిపారు. కానీ తాజాగా సాయి మంజ్రేకర్ పుట్టినరోజు కారణంగా ఈ సినిమా మేకర్స్ ఈ భామ పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఈ క్లారిటీతో మెగాఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సాయి మంజ్రేకర్ ఇదివరకు సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్-3 మూవీలో నటించింది. మొత్తానికి ఈ వయ్యారి వరుణ్ సినిమాతో తెలుగులో డెబ్యూ చేయనుంది. చూడాలి మరి వరుణ్ - సాయిల పెయిర్ ఏ విధంగా ఉండబోతుందో..!!