Begin typing your search above and press return to search.

నిజాన్ని చూపించే విరూపాక్ష విశ్వ‌రూపం!

By:  Tupaki Desk   |   1 Jan 2023 11:32 AM GMT
నిజాన్ని చూపించే విరూపాక్ష విశ్వ‌రూపం!
X
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ లైన్ లోకి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. కొత్త సినిమాల విష‌యంలో మూస‌ధోరిణి వ‌దిలిన‌ట్లే క‌నిపిస్తుంది. పాత ప‌ద్ద‌తికి స్వ‌స్తి ప‌లికి ట్రెండింగ్ హిట్ కాన్సాప్ట్ ల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇటీవ‌లే కార్తీక్ దండుతో కూడా కొత్త సినిమా `విరూపాక్ష‌` లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదొక మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్అ యిన చిన్న టీజ‌ర్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేసారు. గ్లింప్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. స‌స్పెన్స్ ఇంటెన్స్ థ్రిల్ల‌ర్ అని గ్లింప్స్ తోనే క్లారిటీ వ‌చ్చేసింది. `అజ్ఞానం భ‌యానికి మూలం..భ‌యం మూఢ న‌మ్మ‌కానికి కార‌ణం. ఆన‌మ్మ‌కమే నిజ‌మైన‌ప్పుడు..ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్క‌న‌ప్పుడు అస‌లు నిజాన్నిచూపించే మ‌రో నేత్రం విరూపాక్ష అంటూ గ్లింప‌క్స్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ తో ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించింది.

నైట్ షూట్ స‌న్నివేశాలు ఇంటెన్స్ మోడ్ లోకి తీసుకెళ్లాయి. సాయితేజ్ న్యూ లుక్ కొత్త ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చింది. తాజాగా నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రో కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. యాక్ష‌న్ పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. మిస్ట‌రీని ఛేధించే క్ర‌మంలో ఎదురైన స‌వాళ్ల‌ను ఎలా అథిగ‌మిస్తున్నాడు? అన్న‌ది పోస్ట‌ర్లో రివీల్ చేసారు.

బ్యాక్ గ్రౌండ్లో వాతావ‌ర‌ణం అంతా భ‌యానకంగా క‌నిపిస్తుంది. కాలుతోన్న చెట్లు... విరూపాక్ష చేతిలో బ‌ల‌మైన క‌ర్ర‌..తీక్ష‌ణ‌మైన చూపు ప‌రిశీలిస్తే బ‌ల‌మైన శ‌క్తుల‌తోనే పోరాటం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి విరూపాక్ష ఒక్కో అప్ డేట్ సినిమాకి మంచి హైప్ ని తీసుకొస్తుంది. టీజ‌ర్..ట్రైల‌ర్ రిలీజ్ తో మ‌రింత బ‌జ్ క్రియేట్ అవుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు..హిందీ..త‌మిళ్..కన్న‌డ‌..మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 21 రిలీజ్ అవుతుంది. ఈచిత్రాన్ని బీ.వీ.ఎస్ .ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.