Begin typing your search above and press return to search.

టామ్ క్రూజ్ త‌ర్వాత మ‌న సాయి తేజ్ కే అంత డేర్!

By:  Tupaki Desk   |   4 Dec 2020 11:20 AM IST
టామ్ క్రూజ్ త‌ర్వాత మ‌న సాయి తేజ్ కే అంత డేర్!
X
ఆస్కార్ విజేత‌.. సంచ‌ల‌న‌‌ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫ‌ర్ నోలాన్ రూపొందించిన టెనెట్ క్రైసిస్ కాలంలో విడుద‌లై తీవ్రంగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు మ‌హ‌మ్మారీ ఊపు పెరుగుతున్న స‌మ‌యంలోనే ఈ మూవీని థియేట్రిక‌ల్ రిలీజ్ కి తేవ‌డంతో మంచి టాక్ వ‌చ్చినా జ‌నం థియేట‌ర్ల‌కు రాలేదు. ఆ క్ర‌మంలోనే హాలీవుడ్ డేర్ డెవిల్ హీరో టామ్ క్రూజ్ సీక్రెట్ గా థియేట‌ర్ కి వ‌చ్చి టెనెట్ మూవీని చూసి వెళ్లారు. అయితే టామ్ క్రూజ్ రాక‌కు సంబంధించిన క్లిప్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ కావ‌డంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. క‌రోనా క్రైసిస్ ఉన్నా జాగ్ర‌త్త‌ల‌తో సినిమా చూసి వెళ్లారు టామ్ క్రూజ్.

ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే టాలీవుడ్ హీరో సాయి తేజ్ థియేట‌ర్ల‌కు వెళ్లి జ‌నాలను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డం స్ఫూర్తి నింపుతోంది. జాగ్ర‌త్త‌లు తీసుకుని థియేట‌ర్లకు వ‌స్తే ఎలాంటి ఇబ్బందీ ఉండ‌ద‌ని సాయి తేజ్ చెబుతున్నాడు. అత‌డు న‌టిస్తున్న సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ క్రైసిస్ త‌ర్వాత రిలీజ‌వుతున్న అతి పెద్ద సినిమాగా రికార్డుల‌కెక్క‌బోతోంది. ఈ మూవీని క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఆ క్ర‌మంలోనే సాయితేజ్ ప్ర‌చారం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ తొమ్మిది నెల‌లుగా తీవ్ర దిగ్భంధ‌నంలోకి వెళ్లింది. థియేట‌ర్లు తెర‌వ‌క ఎంతో న‌ష్టం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా దేశ‌వ్యాప్తంగా ఈనెల నుంచి థియేట‌ర్ల‌ను పూర్తి స్థాయిలో తెరిచేందుకు రంగం సిద్ధ‌మ‌వ్వ‌డం.. నేటి నుంచి తెలంగాణ‌లోనూ థియేట‌ర్లు తెరుస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

హాలీవుడ్ మూవీ టెనెట్ కి నిర్ధేశించిన 50శాతం కి స‌రిప‌డా జ‌నం వ‌స్తున్నార‌ట‌. ఆ క్రమంలోనే సామాన్య ప్రజలలో విశ్వాసం పెంపొందించడానికి సుప్రీం హీరో సాయి ధరం తేజ్ థియేటర్లను సందర్శించడంపై ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు.

అతను ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ ‌ను సందర్శించాడు. మాస్కులు హ్యాండ్ శానిటైజర్ ‌లతో థియేటర్లకు రావడం పూర్తిగా సురక్షితం అని ప్రజలకు సూచించాడు. సోలో బ్రతుకే సో బెటర్ 2020 డిసెంబర్ 25 న తెరపైకి రానుంది. ఈ మూవీ వీక్ష‌ణ‌కు ఎలాంటి ఢోకా లేకుండా ప్ర‌చారం ప‌రంగా హీట్ పెంచుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి తేజ్ స‌ర‌స‌న‌ నభా నటేష్ నాయిక‌గా న‌టిస్తోంది.