Begin typing your search above and press return to search.

శ్యామ్ కె. నాయుడుకు సందీప్ కిషన్ అండగా నిలుస్తాడా?

By:  Tupaki Desk   |   28 May 2020 6:00 AM GMT
శ్యామ్ కె. నాయుడుకు సందీప్ కిషన్ అండగా నిలుస్తాడా?
X
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చేసుకోకుండా నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ నటి సాయి సుధ పోలీసువారిని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలో చిన్న పాత్రలు పోషించి గుర్తింపు సాధించిన సుధ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో శ్యామ్ తనను మోసం చేశారంటూ కంప్లయింట్ ఇచ్చారు. పోలీసువారు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు.

అవుట్ పుట్ విషయంలో మంచి క్వాలిటీ చూపిస్తూనే వర్క్ చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తారని ప్రొఫెషనల్ గా శ్యామ్ కు పేరుంది. ఆయన పూరి జగన్ తో ఎక్కువ సినిమాలకు పని చేశారు. 'పోకిరి' లాంటి సినిమాలు కూడా వారి కాంబినేషన్లో వచ్చాయి. అయితే నటి సుధ చేసిన ఆరోపణలపై సినీ రంగం నుండి ఎవరూ స్పందించలేదు. సున్నితమైన అంశం కావడంతో ఏం మాట్లాడితే ఏం మెడకు చుట్టుకుంటుందోనని అందరూ మౌనం వహించారు.

ఈ విషయంపై శ్యామ్ అన్నయ్య ఛోటా కె. నాయుడు.. మేనల్లుడు సందీప్ కిషన్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరి హీరో సందీప్ కిషన్ తన మేనమామకు అండగా నిలబడతాడా లేదా మిగతా అందరిలాగానే మౌనంగా ఉంటారా అనేది వేచి చూడాలి.