Begin typing your search above and press return to search.

లవర్ బోయ్ నాగశౌర్యతో థ్రిల్లర్

By:  Tupaki Desk   |   2 Oct 2017 4:09 AM GMT
లవర్ బోయ్ నాగశౌర్యతో థ్రిల్లర్
X
యంగ్ హీరో నాగశౌర్యకు భారీ కమర్షియల్ హిట్లు పెద్దగా ఏమీ లేకపోయినా అతడిని ఛాన్సులు బాగానే వెతుక్కుంటూ వస్తున్నాయి. లో అండ్ మీడియం బడ్జెట్ లో సినిమాలు తీయడానికి ప్లాన్ చేసుకునే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎక్కువగా నాగశౌర్య వైపు చూస్తున్నారు. ముఖ్యంగా లవర్ బాయ్ పాత్రలు చేయడానికి అవసరమైన సాఫ్ట్ లుక్ ఉండటం అతడికో ప్లస్ పాయింట్.

ఇప్పటివరకు నాగశౌర్య చేసిన వాటిలో లవ్ స్టోరీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడికి ఒక డిఫరెంట్ థ్రిల్లర్ లో నటించే అవకాశమొచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా - సుప్రీమ్ - పిల్ల జమిందార్ వంటి మూవీస్ తో మంచి సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న సాయి శ్రీరామ్ మొదటిసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ షూట్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సినిమాను మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. హీరోయిన్ - మిగిలిన ఇంపార్టెంట్ పాత్రలకు ఎవరిని తీసువాలనేది ఇంకా ఫిలిం మేకర్స్ ఓ నిర్ణయానికి రాలేదు.

నాగశౌర్య ప్రస్తుతం తన కెరీర్ లో మొదటి సారి ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఫిదా హీరోయిన్ సాయి పల్లవితో కలిసి తమిళ్ - తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈసినిమా తమిళంలో కరు పేరుతో.. తెలుగులో కణం పేరుతో నిర్మితమవుతోంది.