Begin typing your search above and press return to search.

పూరి ఇంట్లో మరో దర్శకుడా?

By:  Tupaki Desk   |   13 March 2018 11:52 AM IST
పూరి ఇంట్లో మరో దర్శకుడా?
X
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ పూరిజగన్నాథ్. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరిని కవర్ చేసిన ఈ హీరో కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. ఇకపోతే మొదట్లో పూరి దర్శకుడిగా క్లిక్ అయిన తరువాత తన బ్రదర్ సాయి రామ్ శంకర్ ని కూడా హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సాయి దాదాపు 15 సినిమాల్లో నటించాడు.

ఇకపోతే పూరి బ్రదర్ ఈ సారి అన్నయ్య అడుగులను టచ్ చేయాలనిక్ చూస్తున్నాడు. అన్నయ్య దగ్గర కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సాయి ఇప్పుడు తాను కూడా డైరెక్షన్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. గత కొంత కాలంగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం. -ప్రస్తుతం సాయి వాడు నేను కాదు అనే సినిమాలో కథనాయకుడిగా చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది.

ఇక అన్నయ్య పూరి జగన్నాథ్ కూడా దాదాపు మెహబూబా పనులను ఫినిష్ చేశాడు. అందులో ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో లవ్ స్టోరీ తరహాలో తెరకెక్కిన ఆ సినిమా మార్చ్ 23న రిలీజ్ కానుంది. ఇక పూరి ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో తీయాలా అని ప్లాన్ చేస్తున్నాడు