Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ కూడా ఇంట్రెస్టింగేనండోయ్‌

By:  Tupaki Desk   |   15 Feb 2016 5:30 PM GMT
పోస్ట‌ర్ కూడా ఇంట్రెస్టింగేనండోయ్‌
X
పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడు సాయిరాం శంక‌ర్ లైమ్ లైట్ లోంచి వెళ్లిపోయి చాలా కాల‌మే అయింది. మ‌ధ్య‌లో రోమియో అనే సినిమాతో వార్త‌ల్లోకి వ‌చ్చాడు కానీ.. అది కూడా విడుద‌లైన మూణ్నాలుగు రోజుల్లోనే అడ్ర‌స్ లేకుండా పోయింది. దీంతో సాయిరాం ఇక హీరోగా నిల‌దొక్కుకోవ‌డం అసాధ్యం అన్న ఫీలింగు వ‌చ్చేసింది జ‌నాల‌కు. ఐతే ప‌ట్టువ‌దల‌ని విక్ర‌మార్కుడిలా సాయిరాం త‌న ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాడు.తాజాగా అత‌ను అర‌కు రోడ్ లో అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజై ఆస‌క్తిక‌ర విజువ‌ల్స్ తో ఆక‌ట్టుకుంది. ఇప్పుడిక ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది.అది కూడా బాగా ఆస‌క్తి రేకెత్తించేలాగే ఉంది. పోస్ట‌ర్ డిజైనింగ్ చాలా క్రియేటివ్ గా, థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ప‌ర్ఫెక్ట్ గా సూట‌య్యేలా చేశారు.సినిమాలో ఏదో ఉంద‌న్న ఫీలింగ్ క‌లిగించేలా ఉంది పోస్ట‌ర్. నికిషా ప‌టేల్‌ - క‌మ‌ల్ కామ‌రాజు - అభిమ‌న్యు సింగ్‌ - కృష్ణ‌భ‌గ‌వాన్‌ - పృథ్వీ - స‌త్య - కోవై స‌ర‌ళ - అన‌న్య‌.. ఇలా సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రికీ పోస్ట‌ర్ లో చోటిచ్చారు. బాల‌సుబ్ర‌మ‌ణ్యం మేకా నిర్మిస్తున్ను ఈ చిత్రంతో వాసుదేవ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాతోనైనా సాయిరాం ఫామ్ అందుకుంటాడేమో చూడాలి.