Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సూపర్ స్టార్ తో 'ఫిదా' బ్యూటీ రొమాన్స్..?

By:  Tupaki Desk   |   30 Dec 2020 9:07 AM GMT
పాన్ ఇండియా సూపర్ స్టార్ తో ఫిదా బ్యూటీ రొమాన్స్..?
X
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాల్లో ''సలార్'' ఒకటి. 'కేజీఎఫ్‌' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో యంగ్ రెబల్ స్టార్ మోస్ట్ వైలెంట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో ఇతర ఇండస్ట్రీలకి చెందిన నటీనటులను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా 'సలార్' నటించబోయే హీరోయిన్లకు సంబంధించి క్రేజీ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్స్ ను అనుకుంటున్నాడట. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ని ఫిక్స్ చేసినట్లుగా ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో హీరోయిన్ గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే సాయి పల్లవి మొదటిసారి డార్లింగ్ తో కలిసి నటించినట్లు అవుతుంది. 'ఫిదా' సినిమాలో ఆరడుగుల వరుణ్ తేజ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి.. ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి జోడీగా బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరోవైపు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో చాలామంది కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే నటీనటుల ఎంపిక కోసం హైదరాబాద్ లో అన్ని వయసుల వారికి ఆడిషన్స్ నిర్వహించారు. ఇప్పుడు చెన్నై లో ఆడిషన్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో స్టార్ట్‌ చేస్తామని 'సలార్' దర్శకనిర్మాతలు ప్రకటించారు. యంగ్ రెబల్ స్టార్ నుంచి రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.