Begin typing your search above and press return to search.

మెడికల్‌ కౌన్సిల్‌ పరీక్ష రాసిన సాయి పల్లవి

By:  Tupaki Desk   |   2 Sept 2020 2:40 PM IST
మెడికల్‌ కౌన్సిల్‌ పరీక్ష రాసిన సాయి పల్లవి
X
హీరోయిన్‌ సాయి పల్లవి విదేశాల్లో డాక్టర్‌ కోర్సును పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఆమెకు మెడిసిన్‌ పై ఉన్న కోరికతో విదేశాలకు వెళ్లి మరీ అక్కడ చేసింది. విదేశాల్లో మెడిసిన్‌ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో డాక్టర్‌ గా గుర్తింపు దక్కించుకోవాలంటే మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష రాసి ఉతీర్ణత సాధించిన వారికి మాత్రమే డాక్టర్‌ గా పట్టా వస్తుంది. ఇండియాలో ప్రాక్టీస్‌ కు ఖచ్చితంగా మెడికల్‌ కౌన్సిల్‌ పరీక్ష ఉతీర్ణత అయ్యి ఉండాలి. అందుకే సాయి పల్లవి ఆ పరీక్షకు హాజరు అయ్యింది.

కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయిన ఆ పరీక్ష తాజాగా జరిగింది. కేరళ తిరుచ్చిలోని ఎంఏఎం కాలేజీలో సాయి పల్లవి ఒక సాదారణ స్టూడెంట్‌ గా వెళ్లి పరీక్ష రాసింది. కరోనా కారణంగా మొహానికి మాస్క్‌ ధరించడంతో పాటు చేతులకు గ్లౌజ్‌ లు కూడా ధరించింది. పరీక్షకు వెళ్తున్న సమయంలో సింపుల్‌ గానే వెళ్లిన సాయి పల్లవి వచ్చే సమయంలో మాత్రం ఇతర విద్యార్థిని విద్యార్థులతో సెల్ఫీలు దిగేందుకు ఒకే చెప్పింది. పరీక్ష బాగానే రాసిన ఉత్సాహం ఆమెల కనిపించింది.

హీరోయిన్‌ గా కోట్ల పారితోషికంతో ఆఫర్లు వచ్చినా పాత్ర నచ్చలేదు అంటూ సినిమాలను కాదనుకునే సాయి పల్లవి డాన్స్‌ తో పాటు చదువులో కూడా అత్యంత ప్రతిభ కనబర్చుతుంది. అందుకే ఆమె ఈ పరీక్ష రాసి మరీ వైధ్యురాలిగా ప్రాక్టీస్‌ ను మొదలు పెట్టాలని అనుకుంటుంది. తనకు వస్తున్న పారితోషికం నేపథ్యంలో ఆమె అసలు డాక్టర్‌ గా ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు. కాని ఆమె మాత్రం వైధ్య వృత్తిపై ఉన్న కోరికతో ఈ పరీక్ష కూడా పూర్తి చేసింది.