Begin typing your search above and press return to search.

ఆ పిక్ తో ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పెట్టిన సాయి పల్లవి

By:  Tupaki Desk   |   8 May 2022 9:30 AM GMT
ఆ పిక్ తో ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పెట్టిన సాయి పల్లవి
X
తెలుగు.. తమిళ.. మలయాళ సినీ ప్రేక్షకులకు సాయి పల్లవిని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో సాయి పల్లవి కి ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినా కూడా ఆమెకు దక్కిన స్టార్ డమ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయి పల్లవి సినిమాల విషయమై గత కొన్ని రోజులుగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది కాలంగా సాయి పల్లవి కొత్త సినిమాలను కమిట్‌ అయ్యేందుకు నిరాకరిస్తూ వస్తుంది. ఎంత పెద్ద స్టార్ కు జోడీగా నటించమన్నా కూడా సున్నితంగా తిరష్కరిస్తూ వచ్చిందట. గత కొన్నాళ్లుగా అసలు సాయి పల్లవి నిర్మాతలను కూడా కలిసేందుకు ఆసక్తి చూపడం లేదట. దాంతో ఆమె సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకుందేమో అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టింది.

హీరోయిన్ గా ఆమెకు ఉన్న క్రేజ్ తో ఒక్కో సినిమాకు మూడు నాలుగు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అయినా కూడా ఆమె సినిమాలు చేయక పోవడంకు కారణం ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా ఆలోచనలో మునిగి తేలారు. ఆమె నటించిన విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విరాట పర్వం సినిమా విడుదల తేదీని ఇటీవలే ప్రకటించారు. దాంతో విరాట పర్వం సినిమా సాయి పల్లవికి చివరి సినిమా కాబోతుందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ సమయంలో సాయి పల్లవి షేర్ చేసిన ఒక పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి అభిమానులను సస్పెన్స్‌ లోకి నెట్టేసింది.

ఆ ఫోటోలో సాయి పల్లవి చీర కట్టుకుని రోడ్డు మీద పరిగెడుతున్నట్టు ఉంది. ఫేస్ చూపించకుండా కేవలం కాళ్లను పరిగెడుతున్నట్లుగా చూపించడం జరిగింది. దాంతో అసలు ఏం జరుగుతుంది అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 9వ తారీకున రివీల్ చేయబోతున్నట్లుగా సాయి పల్లవి ప్రకటించింది.

ఈ స్టిల్‌ విరాటపర్వం కు సంబంధించింది అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఇది సాయి పల్లవి కొత్త సినిమా అప్డేట్‌ పోస్టర్ అంటూ మరి కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తాసిని సాయి పల్లవి అభిమానులు నరాలు బిగపట్టి మరీ 9వ తారీకు కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమాలు చేయదేమో అనుకుంటున్న సాయి పల్లవి కొత్త సినిమా ప్రకటిస్తే ఖచ్చితంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తారు.