Begin typing your search above and press return to search.

ప్రేమమ్ పాపకు సొంతింటి కష్టాలు

By:  Tupaki Desk   |   28 April 2017 4:42 AM
ప్రేమమ్ పాపకు సొంతింటి కష్టాలు
X
మలయాళ ప్రేమమ్ మూవీతో బోలెడంత పేరు సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుని అందరినీ ఓ స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగులో కూడా మూవీస్ చేసేస్తోంది ఈ హీరోయిన్.

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సాయిపల్లవిని.. మరికొన్ని చిత్రాల్లో తీసుకునేందుకు తెలుగు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇంతగా పేరు తెచ్చుకున్నా అమ్మడికి సొంతింటి కష్టాలు తీరడం లేదు. సొంతిల్లు అంటే.. ఈమె మాతృ భాషా పరిశ్రమ అన్నమాట. మలయాళ మూవీతో గుర్తింపు పొందినా.. సాయి పల్లవి నిజానికి తమిళమ్మాయి. అందుకే తమిళ సినిమాల్లో నటింప చేసేందుకు ప్రయత్నాలు బాగానే జరిగాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మణిరత్నం మూవీలో మొదట సాయిపల్లవినే తీసుకున్నారు. కొన్ని రోజులకే ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ చిన్నది తప్పుకుంది.

ఆ తర్వాత విక్రమ్ మూవీ స్కెచ్ లో హీరోయిన్ గా అగ్రిమెంట్ చేసుకున్న సాయిపల్లవి.. ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకోగా.. ఆ ఛాన్స్ తమన్నాకు దక్కింది. ఇప్పుడు మలయాళ మూవీ ఛార్లీని తమిళ్ లో మాధవన్ హీరోగా రీమేక్ చేయాలని భావించారు. ఈ సినిమాలో సాయిపల్లవినే కన్ఫామ్ చేశారు కూడా. ముచ్చటగా ఈ మూడో తమిళ్ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి నటించడం లేదనే విషయం ఇప్పుడు కన్ఫాం అయిపోయింది. ఈ తమిళమ్మాయికి కోలీవుడ్ కష్టాలు ఎప్పటికి తీరేనో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/