Begin typing your search above and press return to search.

సాయి పల్లవి.. కోలీవుడ్ ఎంట్రీ కన్ఫాం

By:  Tupaki Desk   |   19 Jan 2017 7:12 AM GMT
సాయి పల్లవి.. కోలీవుడ్ ఎంట్రీ కన్ఫాం
X
మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ మొత్తంలో తన ట్యాలెంట్ చూపించేసేందుకు రెడీ అయిపోతోంది. కొంచెం కూడా మేకప్ లేకుండా ఒరిజినల్ అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో ఫిదా మూవీ చేస్తోంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ తేజ్ సరసన టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది సాయి పల్లవి.

ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటేందుకు బయల్దేరిందీ బ్యూటీ. మాధవన్ లీడ్ రోల్ లో చేయనున్న చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మలయాళ మూవీ చార్లీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. 'కొన్ని నెలల క్రితమే మలయాళ చిత్రం చార్లీ రైట్స్ ను కొనుగోలు చేశాం. దర్శకుడు విజయ్ తమిళ్ ఆడియన్స్ కు వీలుగా ఈ చిత్ర కథ కథనాల్లో మార్పులు చేశాడు. ఇప్పుడు ఒరిజినల్ మూవీ కంటే చాలా డిఫరెంట్ గాను బెటర్ గాను స్క్రిప్ట్ సిద్ధమైంది. మార్చ్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం. సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నాం' అని చెప్పారు నిర్మాతలు.

విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. శృతి నల్లప్ప ఈ మూవీ నిర్మించనున్నారు. సాయి పల్లవికి ఈ మూవీని.. తమిళ్ లో హీరోయిన్ గా తొలి చిత్రం అని చెప్పాలి. గతంలో ధామ్ ధూమ్ అనే మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/