Begin typing your search above and press return to search.

సాయి పల్లవి సోదరి తెరంగేట్రం

By:  Tupaki Desk   |   22 Nov 2021 4:43 AM GMT
సాయి పల్లవి సోదరి తెరంగేట్రం
X
మలయాళ రొమాంటిక్ చిత్రం `ప్రేమమ్`లో న‌టించిన‌ప్ప‌టి నుంచి సాయి పల్లవి భారీగా అభిమానులను సంపాదించుకుంది. 2015 బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దక్షిణ భారతదేశం అంతటా ప్రేమ‌మ్ త‌న‌ ఇంటి పేరుగా మారింది. తెలుగులో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ఫిదా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. ఇందులో భానుమ‌తిగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది. ఇటీవ‌లే `ల‌వ్ స్టోరి` చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.

త‌మిళంలోనూ టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. సూర్య NGK సహా ధనుష్ సరసన దియా- మారి 2 వంటి తమిళ చిత్రాలలో కూడా కనిపించింది. ఇప్పుడు సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా `చితిరై సెవ్వానం` అనే చిత్రంతో తమిళ సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సిల్వాకి ఇదే ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా.

చితిరై సెవ్వానంలో జాతీయ అవార్డు విజేత దర్శకన‌టుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబర్ 3న ZEE5 తమిళ OTT ప్లాట్ ఫారమ్ లో ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. దర్శకుడు AL విజయ్ థింక్ బిగ్ స్టూడియో సమర్పణలో అమృత స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రముఖ మలయాళ నటి రిమా కల్లింగల్ కూడా ఇందులో నటించారు.

సామ్ సిఎస్ సంగీతం అందించారు. కవిపెరరసు వైరముత్తు సాహిత్యం అందించారు. గత ఏడాది ద‌ళ‌ప‌తి విజయ్‌ నటించిన మాస్టర్‌ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి తమిళనాడు స్టేట్‌ అవార్డు గ్రహీత స్టంట్‌ సిల్వా దర్శకుడిగా పరిచయం అవుతున్న `చిత్రై సెవ్వానం` సినిమా టైటిల్ ని నేరుగా ప్రస్తావించకుండానే శుభాకాంక్షలు తెలిపారు. అతని కెరీర్ లో తదుపరి పెద్ద స్థాయికి చేరాల‌ని ఆకాంక్షించారు.

చితిరై సెవ్వానం రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో సముద్రకని - పూజా కన్నన్ లు తండ్రీకూతుళ్లుగా సైకిల్ పై వెళ్తున్నారు. ఈ చిత్రం ఎమోషనల్ రైడ్ అని అర్థ‌మ‌వుతోంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ స్టోరి అని కూడా హింట్ అందింది. సాయి పల్లవి తరచుగా తన సోదరి గురించి గొప్పగా మాట్లాడుతోంది.

`చితిరై సెవ్వానం`లో నటిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంద‌నే భావిస్తున్నారు. ఇక సాయిప‌ల్ల‌వి సౌత్ లో పెద్ద స్టార్ గా వెలిగిపోతోంది. అందువ‌ల్ల త‌న సోద‌రి తెరంగేట్రంపై అంచ‌నాలున్నాయి. జూనియ‌ర్ సాయిప‌ల్ల‌వి అని నిరూపించుకుంటుందా? ఫిదా భానుమ‌తి స్థాయిలో అల‌రిస్తుందా? అంటూ హోప్స్ పెట్టుకున్నారు. పూజా క‌న్న‌న్ న‌ట ప్ర‌తిభ ఏ రేంజులో ఉందో వేచి చూడాలి.

ఇక‌పోతే పూజా గతంలో దర్శకుడు AL విజయ్ కి అసిస్టెంట్ గా పనిచేసింది. 2017లో విడుదలైన కారా అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. సముద్రఖని విషయానికొస్తే సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా వినోదయ సీతమ్ తర్వాత ఇది అతని రెండవ పెద్ద డైరెక్ట్ ZEE5 OTT విడుదల అవుతుంది.