Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ డేట్స్ లేవని పవన్ సినిమాను వదులుకుందా..??

By:  Tupaki Desk   |   2 March 2021 7:30 AM GMT
ఆ హీరోయిన్ డేట్స్ లేవని పవన్ సినిమాను వదులుకుందా..??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా హీరోలుగా మలయాళీ ఫిల్మ్ అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమా మొదలైందనే సంగతి తెలిసిందే. ఇదివరకే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే పవన్ వకీల్ సాబ్ సినిమా కంప్లీట్ చేసి.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పీరియడిక్ మూవీ కంప్లీట్ చేస్తున్నాడు. అయితే అతిత్వరలోనే ఆ సినిమా కంప్లీట్ కానుందట. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకోసం పవన్ తక్కువ రోజులే టైం ఇచ్చినట్లు సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఏకే' మూవీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ రెడీ అవుతోందట. అయితే ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్యరాజేష్ నటిస్తుండగా.. పవన్ భార్యగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి.

అలాగే మేకర్స్ కూడా సాయిపల్లవి పేరు ఖరారు అయినట్లుగా మధ్యలో తెలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ పాత్రకోసం చాలామంది పేర్లు వినిపించినా ఎక్కువగా సాయిపల్లవి వైరల్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సాయిపల్లవి పవన్ సినిమాలో లేదని టాక్. ఎందుకంటే ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందువలన తన డేట్స్ పవన్ సినిమాకు కేటాయించడం కష్టమైందని చెబుతున్నట్లు సమాచారం. మొదటి నుండి కూడా డేట్స్ కేటాయిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ చివరిగా కుదరలేదని ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ఈ సినిమాలో తన పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉందని భావించినట్లు పూకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మేకర్స్ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఈ సినిమాకు రచన త్రివిక్రమ్ అందిస్తున్నాడు. ప్రస్తుతం సాయిపల్లవి లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలతో బిజీగా ఉంది.