Begin typing your search above and press return to search.

అలాంటి సినిమాలకు.. పాత్రలకు నేను దూరం

By:  Tupaki Desk   |   26 Feb 2020 4:00 AM IST
అలాంటి సినిమాలకు.. పాత్రలకు నేను దూరం
X
తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చినా కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈమె శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమె నాగచైతన్యతో కలిసి లవ్‌ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళం మరియు మలయాళంలో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను కెరీర్‌ లో ఇన్ని సినిమాలు చేశాను అని కాకుండా మంచి సినిమాలు చేశాను అని చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకే ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఓకే చెప్పడం లేదు. కథకు పాత్రకు సంబంధం లేని పాత్రలు కొన్ని నా వద్దకు వస్తున్నాయి. అలాంటి పాత్రలు.. అలాంటి సినిమాలు నేను అస్సలు చేయాలుకోవడం లేదు అంటూ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

కథలో కీలకమైన పాత్ర ఉంటేనే తనను సంప్రదించాలంటూ సాయి పల్లవి ఫిల్మ్‌ మేకర్స్‌ ను రిక్వెస్ట్‌ చేస్తుంది. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ కు స్కోప్‌ తక్కువ ఉంటుంది. ఎలాంటి పాత్రలను అయినా చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే స్టార్‌ హీరోయిన్‌ గా నిలుస్తారు. కాని సాయిపల్లవి మాత్రం స్టార్‌ హీరోయిన్‌ అక్కర్లేదు మంచి నటిగా పేరు వస్తే చాలు అనుకుంటుంది.