Begin typing your search above and press return to search.

సాయిపల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:30 PM GMT
సాయిపల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్
X
సాయిపల్లవి.. ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన కథానాయిక. ‘ఫిదా’లో భానుమతిగా ఆమె అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అచ్చమైన తెలంగాణ యాసలు అద్భుత రీతిలో డైలాగులు చెబుతూ తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది సాయిపల్లవి. అందులో ఆమె లుక్.. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు చూస్తే.. అలాగే సాయిపల్లవి అనే పేరు చూస్తే.. ఆమె ఇక్కడమ్మాయా అన్న సందేహాలు కలగడం సహజం. ఐతే సాయిపల్లవి నేపథ్యం గురించి మన జనాలకు పెద్దగా తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి పూర్తి వివరాలు వెల్లడించిందామె.

సాయిపల్లవిది తమిళనాడు సరిహద్దుల్లోని కోటగిరి అనే ఓ చిన్న పల్లెటూరట. ఆమె తల్లి కస్టమ్స్ ఆఫీసరట. సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలట. అందుకే ఆమె పేరు సాయిపల్లవి అని పెట్టారట. ఇక అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాయిపల్లవి కవల పిల్లల్లో ఒకరట. ఆమె తన చెల్లెలు పూజతో కలిసి ఒకేసారి పుట్టిందట. గతంలో పూజతో కలిసి సాయిపల్లవి ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. అందులో ఇద్దరూ ఒకేలా కనిపించారు. దాని వెనుక అసలు మతలబు ఇప్పుడో ఇంటర్వ్యూలో వెల్లడించింది సాయిపల్లవి. 12వ తరగతి పూర్తి చేశాక ‘ఢీ’ డ్యాన్స్ షోకు అప్లై చేశానని.. అందులో ప్రతిభ చాటుకున్నాక తాను సినిమాల వైపు వెళ్లిపోతాననే భయంతో తన తండ్రి మెడిసిన్ కోసం జార్జియాకు పంపించేశారని.. ఐతే మెడిసిన్ చివరి సంవత్సరం సెలవుల్లో ఇండియాకు వచ్చినపుడు అనుకోకుండా ‘ప్రేమమ్’లో నటించే అవకాశం వచ్చిందని.. ఆ సినిమా పూర్తయ్యాక మళ్లీ జార్జియా వెళ్లి చదువు పూర్తి చేసి వచ్చానని.. ఒక డాక్టర్ గా ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని సాయిపల్లవి తెలిపింది.