Begin typing your search above and press return to search.

టాప్ 1లో ట్రెండ్ అవుతున్న సాయి ప‌ల్ల‌వి మూవీ!

By:  Tupaki Desk   |   4 July 2022 7:52 AM GMT
టాప్ 1లో ట్రెండ్ అవుతున్న సాయి ప‌ల్ల‌వి మూవీ!
X
కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో కంటే ఓటీటీల్లోనూ ఎక్కువ ఆద‌ర‌ణ‌ని ద‌క్కించుకుంటున్నాయి. ఆ మ‌ధ్య విడుద‌లైన ఆకాశం నీ హ‌ద్దురా', జై భీమ్‌', నార‌ప్ప‌, దృశ్యం 2 చిత్రాలు ఓటీటీల్లో డైరెక్ట్ గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకున్నాయి. అయితే థియేటర్ల‌లో విడుద‌లై టాక్ బాగున్నా అక్క‌డ ఆద‌ర‌ణ పొంద‌ని సినిమాలకు ఓటీటీ ప్రియులు ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

రానా ద‌గ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించిన మూవీ 'విరాట‌ప‌ర్వం'. వేణు ఊడుగుల తెర‌కెక్కించిన ఈ సినిమా గ‌త ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు జూన్ 17న భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీకి టాక్ పాజిటివ్ గా వినిపించింది. గుడ్ మూవీ అని కితాబిచ్చారు... చాలా వ‌ర‌కు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపించారు.

అయితే టాక్ స్టాయిలో సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న ల‌భించ‌లేదు. భారీ స్థాయిలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాలేదు. పెరిగిన టికెట్ రేట్లు.. ఫ్యామిలీతో సినిమాకు రావ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భారంగా మార‌డంతో చాలా మంది థియేట‌ర్ల‌కు రావ‌డానికి జంకుతున్నారు.

రెండు మూడు వారాల్లో సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌ర‌గుతుండ‌టంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్ గేటు వైపు కూడా చూడ‌టం లేదు. ఇదే 'విరాట‌ప‌ర్వం' మూవీకి ఇబ్బందుల‌ని సృష్టించింది.

దీంతో టాక్ బాగుతున్న ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డంతో మేక‌ర్స్ ఈ మూవీని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో జూలై 1 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో చూస్తున్న ప్రేక్ష‌కులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురినిస్తున్నారు. ఇలాంటి గుడ్ మూవీని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసి వుంటే బాగుండేద‌ని కామెంట్ లు చేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ఆద‌ర‌ణ పొందుతున్నఈ మూవీ ప్ర‌స్తుతం నం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఆక‌ట్టుకుంటోంది. ఇండియ‌న్ సినిమాల్లో ఈ మూవీ ఫ‌స్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుండ‌టంతో సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. త్వ‌ర‌లో సాయి ప‌ల్ల‌వి త‌మిళ మూవీ 'గార్గీ'తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. విభిన్న‌మైన క‌థ‌తో రూపొందుతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.