Begin typing your search above and press return to search.

భానుమ‌తి హైబ్రీడ్ పిల్ల‌..సాయి ప‌ల్ల‌వి అంతేనా?

By:  Tupaki Desk   |   7 Jun 2022 8:32 AM GMT
భానుమ‌తి హైబ్రీడ్ పిల్ల‌..సాయి ప‌ల్ల‌వి అంతేనా?
X
త‌మిళ న‌టి సాయి ప‌ల్ల‌వి న‌టించిన తొలి చిత్రం `ఫిదా`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసేసింది. త‌న‌దైన న‌ట‌నతో మెస్మ‌రైజ్ చేసి సాయి ప‌ల్ల‌వి టాలీవుడ్ లో చేసిన తొలి చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో `భానుమ‌తి ఒక్క‌టే పీస్ రెండు కులాలు.. రెండు మ‌తాలు హైబ్రీడ్ పిల్ల` అంటూ సాయి ప‌ల్ల‌వి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ మూవీతో ప‌క్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా న‌టిగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

అంతా గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే అంద‌రికి భిన్నంగా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో, మని ఇంటి అమ్మాయిలా ఫీల్ ని క‌లిగిస్తూ మెస్మ‌రైజింగ్ చేసే డ్యాన్స్ తో ఆక‌ట్టుకుంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటోంది. సింపుల్ గా క‌నిపిస్తూనే స్టార్ హీరోల‌కు సమాన‌మైన క్రేజ్ ని సొంతం చేసుకుని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. త‌న స‌మ‌కాలీన క్రేజీ హీరోయిన్ లు స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న, పూజా హెగ్డేల త‌ర‌హాలో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించ‌క‌పోయినా వాళ్ల‌కు మించిన క్రేజ్ సాయి ప‌ల్ల‌వి సొంతం.

గ్లామ‌ర్ మాత్ర‌మే మాట్లాడే ఈ రంగుల ప్ర‌పంచంలో తాను మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అంటూ సాయి ప‌ల్ల‌వి త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటోంది. `భానుమ‌తి ఒక్క‌టే పీస్ హైబ్రీడ్ పిల్ల` అన్న‌ట్టుగా సాయి ప‌ల్ల‌వి కూడా అదే త‌ర‌హా క్వాలిటీస్ తో క్రేజీ హీరోయిన్ గా త‌న స‌త్తాని చాటుకుంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. అంద‌రు హీరోయిన్ ల త‌ర‌హాలో రెగ్యుల‌ర్ క‌మ‌ర్ష‌యిల్ సినిమాల‌ల్లో న‌టించ‌కుండా త‌న‌దైన ప్ర‌త్యేక‌త వున్న సినిమాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది.

ఇదే ఆమెకు అభిమానుల్లో అమిత‌మైన క్రేజ్ ని క‌లిగిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యేవారి సంఖ్యని చూస్తే మ‌తిపోవాల్సిందే. పెద్ద‌గా సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుండ‌ని న‌టికి ఈ రేంజ్ ఫాలోయింగ్ అంటే మాటలు కాదు. ఇక ఆమె సినిమా ఈవెంట్ ల‌లో పాల్గొంటోందంటే అభిమానులు చేసే హ‌డావిడి కూడా భారీ లెవెల్లో వుంటోంది. ఆ మ‌ధ్య జ‌రిగిన `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` ఈ వెంట్ లో సాయి ప‌ల్ల‌వి పాల్గొంది.

ఆమె క్రేజ్ ని గ‌మ‌నించిన స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ సంబోధించి ఆమెకున్న క్రేజ్ ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టారు. తాజాగా `విరాట‌ప‌ర్వం` ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ వ‌ర్షం కార‌ణంగా డిస్ట్ర‌బ్ అయినా అవేవీ ప‌ట్టించుకోకుండా సాయి ప‌ల్ల‌వి వ‌ర్షంలో త‌డుస్తూ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడింది. ఈ స‌మ‌యంలో అభిమానులు వ‌ర్షం లో త‌డుస్తూనే త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా వుంటే సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతుంటే రానా త‌ను త‌డ‌వ‌కుండా గొడుగు ప‌ట్ట‌డం ప‌లువురిని ఆకట్టుకుంది.

స్టార్ హీరోయిన్ లు ఎంత మంది వున్నా తాను మాత్రం చాలా భిన్నం అంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటుండ‌టంతో భానుమ‌తి హైబ్రీడ్ పిల్ల‌..సాయి ప‌ల్ల‌వి అంతేనా? అని ప‌లువురు కామెంట్ లు చేస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి న‌టించిన తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా హీరోగా వేణు ఊడుగుల తెర‌కెక్కించిన ఈ మూవీ జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.