Begin typing your search above and press return to search.

కారులో మన కుర్రాడు మిస్సింగ్

By:  Tupaki Desk   |   9 Jun 2017 1:03 PM GMT
కారులో మన కుర్రాడు మిస్సింగ్
X
హీరోయిన్ అమలా పాల్ మాజీ భర్త.. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఉన్నాడు చూడండి.. ఎన్ని సినిమాలు ఫ్లాపైనా కూడా వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఇప్పుడు ''కారు'' అనే సినిమాతో వస్తున్నాడు. తెలుగు వాళ్లకు సంబంధించినంత వరకు ఈ సినిమాలోని ఒక విశేషం ఏంటంటే.. ఈ సినిమాతో మన హీరో నాగ శౌర్య తమిళంలో డెబ్యూ చేస్తున్నాడు.

ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాతో నాగ శౌర్య అక్కడ డెబ్యూ చేస్తున్నప్పటికీ.. ఇవాళే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో మాత్రం మనోడు కనిపించలేదు. నిజానికి ఆ పోస్టర్లో హీరోయిన్ సాయిపల్లవి అలాగే మరో పాప కనిపించారు. విషయం ఏంటంటే.. ఈ సినిమాతో తమిళ పిల్ల సాయి పల్లవి కూడా తొలిసారి తమిళంలో డెబ్యూ చేస్తోంది. అందుకే ఫోకస్ అంతా ఆమెపైనే పెట్టినట్లున్నాడు. అయినా కూడా ఏ.ఎల్.విజయ్ తీసే సినిమాలన్నీ కూడా ఉమెన్ సెంట్రిక్ గానే ఉంటాయి. కాబట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ లో నాగశౌర్య సంగతి కాదుకాని.. అసలు సినిమాలో కూడా మనోడు ఫోకస్ అంతా సాయిపల్లవిపైనే పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ఇక ఆ ఫస్ట్ లుక్ గురించి మాట్లాడితే.. తల్లి ఒడిలో ఒక కూతురా? లేదంటే అక్క ఒడిలో చెల్లా? తెలియదు కాని.. వారిద్దరినీ ప్రకృతి కాపాడుతున్నట్లు ఒక కంచె.. ఈ విధంగా క్రియేటివ్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు దర్శకుడు విజయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/