Begin typing your search above and press return to search.

ప్రేమమ్ బ్యూటీ పవర్ స్టార్ ఫ్యాన్

By:  Tupaki Desk   |   25 Jun 2017 4:38 AM GMT
ప్రేమమ్ బ్యూటీ పవర్ స్టార్ ఫ్యాన్
X
మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవికి మంచి క్రేజ్ విపరీతంగా ఏర్పడింది. టాలీవుడ్ కూడా ఈ బ్యూటీని ఆన్ స్క్రీన్ పై చూసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఫిదా చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించనుంది సాయి పల్లవి.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఫిదా ట్రైలర్ ద్వారా సాయి పల్లవి పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. "భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల" అంటూ తనను తాను పరిచయం చేసుకున్న సాయిపల్లవి.. ఫిదా మూవీలో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనుందట. తెలంగాణకు చెందిన అమ్మాయిగా. పవర్ స్టార్ వీరాభిమానిగా కనిపించే సాయి పల్లవి పాత్ర సినిమాలో చాలా బాగుంటుందని అంటున్నారు. ట్రైలర్ లో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ "తిక్కుంటే లెక్కుండాలి.. కానీ ఈ పిల్లకు ఓన్లీ తిక్క" గుర్తు చేసుకుంటే.. సాయి పల్లవి పాత్ర పవన్ వీరాభిమాని అనే విషయం ఫిక్స్ చేసుకోవచ్చు.

ఈ మూవీ షూట్ స్టార్ట్ చేయకముందు కూడా మెడ మీద చేయి పోనిచ్చే పవన్ సిగ్నేచర్ మూమెంట్ ను ప్రాక్టీస్ చేస్తున్న సాయి పల్లవి.. పక్కనే వరుణ్ తేజ్.. శేఖర్ కమ్ముల ఉన్న ఫోటోను గుర్తు చేసుకుంటే ఈ విషయం ఖాయం చేసేసుకోవచ్చు. ఫిదా మూవీతో తనకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందని సాయి పల్లవి ఆశిస్తోంది. జూలై 21న ఫిదాను రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/