Begin typing your search above and press return to search.

ప్రేమమ్ పాప ఇంకోటి వదిలేసింది!!

By:  Tupaki Desk   |   31 Jan 2017 5:24 AM GMT
ప్రేమమ్ పాప ఇంకోటి వదిలేసింది!!
X
మలయాళ మూవీ ప్రేమమ్ తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సంపాదించేసింది సాయి పల్లవి. ఆ తర్వాత అవకాశాలు వెల్లువలా వచ్చినా.. ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ.. నెమ్మదిగా అడుగులు వేస్తోంది. అయినా సరే.. ఈమె సెలక్షన్ లో ఏదో తేడా కొట్టేస్తోంది.

మణిరత్నం లేటెస్ట్ మూవీ చెలియాలో మొదట సాయిపల్లవినే తీసుకున్నారు. డేట్స్ ప్రాబ్లెంతో ఈమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ అదితిరావు హైదరికి దక్కింది. ఇప్పుడు మరో భారీ చిత్రం నుంచి కూడా సాయిపల్లవి తప్పుకుందట. చియాన్ విక్రమ్ తో కలిసి సాయిపల్లవి ఓ మూవీ చేయాల్సి ఉంది. విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది కూడా. కానీ గౌతమ్ మీనన్ తో విక్రమ్ మూవీ ఇంకా పూర్తి కాకపోవడంతో.. విక్రమ్-సాయి పల్లవిల మూవీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ భారీ చిత్రం నుంచి తప్పుకుందట సాయి పల్లవి.

ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ కి జోడీగా ఫిదా చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం కావడంతో ఈమె టాలీవుడ్ అరంగేట్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా మరో తమిళ్ మూవీని యాక్సెప్ట్ చేసింది. మాధవన్ నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/