Begin typing your search above and press return to search.

రౌడీ పిల్లతోనే అస‌లైన‌ బ‌స్తీ మే స‌వాల్..!

By:  Tupaki Desk   |   2 March 2021 7:30 AM GMT
రౌడీ పిల్లతోనే అస‌లైన‌ బ‌స్తీ మే స‌వాల్..!
X
న‌ట‌న డ్యాన్సుల్లో అద్భుతంగా రాణిస్తూ ఇప్ప‌టికే త‌న‌కంటూ ఒక స్థాయిని అందుకుంది సాయి ప‌ల్ల‌వి. ప్రేమ‌మ్ సినిమాతో ప‌రిచ‌యం అయ్యింది మొద‌లు సాయి ప‌ల్ల‌వి హ‌వా టాలీవుడ్ లో ఎంత‌మాత్రం త‌గ్గ‌లేదు. ఇక్క‌డ న‌టిగానే కాదు.. డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ గా కూడా ప‌ని చేస్తోంది. కొంద‌రు హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సాయిప‌ల్ల‌వి ఒక పాట‌కైనా త‌మ సినిమాల్లో కొరియోగ్రాఫ్ చేయాల‌ని కోరుకుంటున్నారంటే తన ట్యాలెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక నేటిత‌రం నాయిక‌ల్లో సాయిప‌ల్ల‌వి అంత ఫ్లెక్సిబుల్ గా డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్ట‌డం అన్న‌ది ఇత‌ర నాయిక‌ల‌కు సాధ్య‌ప‌డ‌ద‌ని అభిమానులు భావిస్తారు. అందం కంటే డ్యాన్సులు న‌ట‌న‌తోనే ఈ అమ్మ‌డికి అంత పాపులారిటీ. అంత గొప్ప పేరుప్ర‌ఖ్యాతులు ఇటీవ‌ల‌ వేరొక నాయిక‌కు రాలేదు. ఇక సాయిప‌ల్ల‌వి ప్ర‌తిభ‌కు చిహ్నంగా ఇంత‌కుముందు ఫిదాలో `వ‌చ్చిండే పాట..` ఎంత‌టి సంచ‌ల‌నం అయ్యిందో తెలిసిందే. ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. కోటానుకోట్ల మంది వీక్ష‌ణ‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌ర్వాతా ధ‌నుష్ తో కలిసి రౌడీ బేబి అంటూ సాయిప‌ల్ల‌వి వేసిన స్టెప్పుల‌కు అభిమానులు సాహో అనేశారు. ఈ పాట కూడా యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ రికార్డుల‌ను వేరొక‌రు అందుకోలేని స్థాయిలో ఉన్నాయి.

అందుకే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ల‌వ్ స్టోరీలోనూ సాయిప‌ల్ల‌విదే హ‌వా! అంటూ చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ల‌వ్ స్టోరి బిజినెస్ 40కోట్ల‌కు చేరుకోవ‌డం సాయి ప‌ల్ల‌వి క్రెడిటే అంటూ ప్ర‌చారం సాగిపోతోంది. సారంగ‌ద‌రియా ప్రోమో .. సింగిల్స్ లో డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టిన సాయి ప‌ల్ల‌వి ముందు చైతూ క‌నిపించ‌డు! అన్న చ‌ర్చా యూత్ లో సాగుతోంది. ఒక ర‌కంగా సాయి ప‌ల్ల‌వి ఎక్క‌డ ఉంటే అక్క‌డ హీరోల‌కు గండ‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

అయితే చైతూ ఈ గండం గ‌ట్టెక్కేదెలా? ఇంత‌కుముందు ఫిదాలో వ‌రుణ్ తేజ్ బాగానే న‌టించాడ‌ని టాక్ వ‌చ్చింది. ఇప్పుడు ల‌వ్ స్టోరిలోనూ సాయిప‌ల్ల‌వితో పోటీప‌డుతూ మెప్పించాడ‌ని చైతూపై క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించాలి. అప్పుడే ఆ గండం నుంచి అత‌డు గ‌ట్టెక్కిన‌ట్టు! న‌ట‌న‌తో చై డామినేట్ చేయాలి అమ్మ‌డిని.