Begin typing your search above and press return to search.
లవ్ స్టోరీ: ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్న చైతు
By: Tupaki Desk | 21 April 2020 5:00 PM ISTఒక సినిమా హిట్ అయితేఎవరికీ క్రెడిట్ ఎక్కువగా దక్కుతుంది అనేది చాలా అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి సినిమా హిట్ అయినా కొందరికి క్రెడిట్ దక్కదు. ఈమధ్య అక్కినేని నాగ చైతన్యకు తరచూ ఇలాంటి ఇబ్బందే ఎదురవుతోంది. ఈమధ్య చైతూ నటించిన సినిమాల్లో క్రెడిట్ అటు హీరోయిన్ కో లేదా డైరెక్టర్ కో వెళ్ళిపోతోంది. దీంతో ఈ విషయంలో టెన్షన్ పడుతున్నాడట. అందుకే ఇలాంటివి రిపీట్ కాకుండా తనవైపు నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ప్రస్తుతం నాగ చైతన్య - సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు శేఖర్ కమ్ముల. మంచి కాఫీ లాంటి సినిమాలు తీసే ఈ డైరెక్టర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకే ప్రాధ్యాన్యత ఎక్కువ ఉంటుందనేది కాఫీలు తాగేవారికి తగ్గని వారికీ .. అందరికీ తెలిసిన విషయమే. పైగా సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఉంటే ఫోకస్ అంతా ఆమె పైనే ఉంటుంది. ఫోకస్ లేకపోయినా తన నటనతో.. డ్యాన్స్ తో ఏదో ఒకటి చేసి ఫోకస్ తనవైపుకు మళ్లేలా చేసుకుంటుంది. సాయి పల్లవి నటించినా సినిమాలన్నిటిలో ఇదే పరిస్థితి. సాయి పల్లవి హీరోయిన్ గా ఉందంటే చాలు .. అసలు ప్రేక్షకులు కూడా హీరోను పెద్దగా పట్టించు కోరు. ఈ సినిమాకు ముందు నుంచే చైతుకు ఇలాంటి ఇబ్బంది ఉంది. దీంతో సాయి పల్లవి డామినేషన్ ను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడని టాక్ వినిపిస్తోంది.
చైతు ఇప్పటికే తన మేనేజర్లను రంగంలోకి దింపి దర్శకుడు శేఖర్ పై ఈ విషయంలో ప్రెజర్ పెడుతున్నాడట. ఎడిట్ టేబుల్ పై తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా చూసుకుంటున్నాడట. ఈ విషయంలో చైతుకు మద్దతుగా సమంతా కూడా రంగంలోకి దిగి చక్రం తిప్పుతోందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడక తప్పదు.