Begin typing your search above and press return to search.

విజ‌య‌శాంతి త‌రువాత ఆ ఘ‌న‌త సాయి ప‌ల్ల‌వికే ద‌క్కిందా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 2:30 PM GMT
విజ‌య‌శాంతి త‌రువాత ఆ ఘ‌న‌త సాయి ప‌ల్ల‌వికే ద‌క్కిందా?
X
రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ 'విరాట‌ప‌ర్వం'. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. గ‌త ఏడాది కాలంగా విడుద‌ల వాయిదాప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం జూన్ 17న మ‌రి కొన్ని గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోటోంది. 'నీది నాది ఒకే క‌థ‌' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వేణు ఊడుగుల ఈ మూవీని రూపొందించారు.

ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీకి సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన ఓ య‌దార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. సినిమాలో రానా హీరో అయినా సాయి ప‌ల్ల‌వి పాత్ర ప్ర‌ధానంగానే ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతూ వ‌స్తున్నారు.

న‌క్స‌ల్స్ ఉద్య‌మంలోకి వెళ్లిన డాక్ట‌ర్ ర‌వ‌న్న‌గా మారి అర‌ణ్య పేరుతో విప్ల‌వ ర‌చ‌న‌లు చేస్తుంటే అత‌ని ర‌చ‌న‌ల‌కు ఆక‌ర్షితురాలైన వెన్నెల అత‌న్ని వెతుక్కుంటూ వెళ్లి ఏం చేసింది?.. ఈ క్ర‌మంలో ఆమె ఎదుర్కొన్న స‌వాళ్లెంటీ? అనే నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ఇప్ప‌టికే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి బ‌జ్ ని క్రియేట్ చేసింది. సాయి ప‌ల్ల‌వికున్న క్రేజ్ ఈ మూవీకి మ‌రింత హైప్ ని తీసుకొచ్చింది. ఇటీవ‌ల ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో పాల్గొన్న ద‌ర్శ‌కుడు సుకుమార్ .. సాయి ప‌ల్ల‌విని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పోలుస్తూ లేడీ ప‌వ‌ర్ స్టార్ అని పిల‌వ‌డంతో ఆ పేరు ఇప్ప‌డు ప్ర‌తీ నోట మారుమ్రోగిపోతోంది.

బుధ‌వారం జ‌రిగిన ఈవెంట్ లోనూ సాయి ప‌ల్లివి స్పెష‌ల్ ఏవీని ప్ర‌ద‌ర్శించారు. అందులో లేడీ ప‌వ‌ర్ స్టార్ అని సాయి ప‌ల్ల‌విని సంబోధించ‌డం విశేషం. ఈ స్థాయి క్రేజ్ ఈ మ‌ధ్య కాలంలో ఏ హీరోయిన్ కి ద‌గ్గ‌కేదు. గ‌తంలో అల‌నాటి సీనియ‌ర్ హీరోయిన్ విజ‌యశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టించారు. స్టార్ హీరోల‌కు ధీటుగా సినిమాలు చేశారు. దీంతో ఆమెకు లేడీ సూప‌ర్ స్టార్ అని, లేడీ అమితాబ్ అని పొగ‌డ్త‌ల్లో ముంచెత్త‌గామే కాకుండా స్టార్ స్టేట‌స్ ట్యాగ్ లు ఇచ్చారు.

మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత ఆ ఘ‌న‌త‌ని సాధించిన హీరోయిన్ గా సాయి ప‌ల్ల‌వి నిల‌వ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. దీంతో త‌ను టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. మ‌రి కొన్ని గంట‌ల్లో విడుద‌ల‌వుతున్న 'విరాట‌ప‌ర్వం' మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిస్తే సాయి ప‌ల్ల‌వి కి లేడీ ప‌వ‌ర్ స్టార్ అనే ట్యాగ్ గ్యారెంటీగా నిలిచిపోతుంద‌ని నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. ఏం జర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.