Begin typing your search above and press return to search.

సాయిపల్లవి, రానా కాంబినేషన్ లో మూవీ

By:  Tupaki Desk   |   27 Dec 2018 11:25 AM IST
సాయిపల్లవి, రానా కాంబినేషన్ లో మూవీ
X
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ పైకి వెళ్లనుంది. తెలుగులో ‘ఫిదా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను సాయిపల్లవి తన వైపు తిప్పుకొంది. ఇక రానా బహుబలి లాంటి ప్రతిష్టాత్మకమైన మూవీలో బళ్లాలదేవా మెప్పించి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కనుందనే వార్త సీనివర్గాల్లో చక్కర్లు కొడుతోంది..

పీరియాడిక్ మూవీలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీకాదు. త్వరలోనే దర్శకుడు రాజమౌళి పర్యవేక్షణలో మెగా పవర్ స్టార్ రాంచరణ్- జూనియర్ ఎన్టీఆర్ మల్టిస్టారర్ మూవీ కూడా పీరియాడిక్ కథతోనే తెరకెక్కుతుందని గాసిప్ ఉంది.

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ వేణు ఉడుగుల- రానా హీరోగా ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కించనున్నారు. అదే విరాటపర్వం 1992. విరాటపర్వం సినిమా 50ఏళ్ల టైమ్ గ్యాప్ లో జరుగుతుందని దర్శకుడు చెబుతున్నాడు.

ఈ మూవీలో రానా పక్కన సాయిపల్లవిని తీసుకున్నారు. కథకు సంబంధించి సాయిపల్లవి- దర్శకుడు వేణు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పీరియాడిక్ మూవీలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు.

ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటిపోతుందని సమాచారం. మొదటగా ఈ సినిమాలో శర్వానంద్ ను హీరోగా అనుకున్నారు. కాగా శర్వానంద్ అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఈ కథ రానా వద్దకు వెళ్లింది. తాజాగా రానాతోపాటు సాయిపల్లవి మూవీ చేయడానికి ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ సినిమా పై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.