Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఫ్లాప్ .. అందుకే డబ్బులొద్దన్నాను: సాయిపల్లవి

By:  Tupaki Desk   |   14 Jun 2022 11:01 AM IST
ఆ సినిమా ఫ్లాప్ .. అందుకే డబ్బులొద్దన్నాను: సాయిపల్లవి
X
ఒకప్పుడు సౌందర్య .. స్నేహా మాదిరిగా తెరపై ఎలాంటి స్కిన్ షో చేయకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది. అయితే డాన్స్ విషయంలో హీరోలతో పోటీపడటం సాయిపల్లవిలోని మరో ప్రత్యేకతగా కనిపిస్తుంది. పాత్రత నచ్చితే పారితోషికాన్ని గురించి పట్టించుకోకపోవడం .. పాత్ర నచ్చకపోతే ఎంత పారితోషికాన్ని ఇస్తామని చెప్పినా ఒప్పుకోకపోవడం ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. యూత్ లోను సాయిపల్లవి పట్ల ఒక గౌరవ భావం ఏర్పడటం విశేషం.

సాయిపల్లవి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విరాటపర్వం' సినిమా రెడీ అవుతోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "మేము శ్రీమంతులమని చెప్పలేంగానీ డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు.

అమ్మా నాన్న ఇద్దరూ కూడా ఎప్పుడు ఏది అవసరమైతే అది అందిస్తూ వచ్చారు. దేనికోసమైనా ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు అది ఎంతవరకూ అవసరమో ఆలోచన చేయమని మాత్రమే చెబుతారు.

నేను సంపాదించిన డబ్బు మా అమ్మకే ఇస్తాను .. అన్ని విషయాలు ఆమెనే చూసుకుంటుంది. నేను ఏది కొన్నప్పటికీ 'ఓటీపీ' మా అమ్మకే వెళుతుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అమ్మ చూసుకోవడమే మంచిదనేది నా ఫీలింగ్. నా కథల ఎంపిక విషయంలో నిర్ణయం నాదే. మిగతా విషయాలు అమ్మనే చక్కబెడుతుంది. నా సినిమాలో ఫ్లాప్ అయితే సహజంగానే నేను బాధపడతాను. నాకు చెడ్డ పేరు వస్తుందని కాదు .. నిర్మాత నష్టపోయాడే అనిపిస్తుంది. 'పడి పడి లేచే మనసు' సినిమా విషయంలో అదే జరిగింది.

ఈ సినిమా విషయంలో నేను అడ్వాన్స్ తీసుకున్నాను .. మిగతా ఎమౌంట్ నిర్మాత సుధాకర్ గారు ఇవ్వవలసి ఉంది. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో .. బ్యాలెన్స్ ఎమౌంట్ ఇవ్వవలసిన పనిలేదని అమ్మ సుధాకర్ గారికి చెప్పింది.

అయినా ఆయన వినిపించుకోలేదు. చివరి రూపాయి వరకూ ఆయన క్లియర్ చేశారు. రేపటి రోజున అవకాశాలు లేకపోతే ఎలా అనే టెన్షన్ ఎప్పుడూ లేదు. నేను చదివిన మెడిసిన్ నాకు తోడుగానే ఉంది. అవసరమైతే ఇంకా చదువుతాను .. నాకు ఇష్టమైన డాక్టర్ గానే కొనసాగుతాను" అని చెప్పుకొచ్చింది.