Begin typing your search above and press return to search.

స్టాఫ్ గా కనిపించినా క్రిష్ పని రాక్షసుడే

By:  Tupaki Desk   |   14 Jan 2017 9:07 AM GMT
స్టాఫ్ గా కనిపించినా క్రిష్ పని రాక్షసుడే
X
మిగిలిన విషయాల దగ్గర ఎలా ఉన్నా.. పని దగ్గర కొందరు చాలా కరుకుగా ఉంటారు. ఏ చిన్న లోపాన్ని వారు తట్టుకోలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా ఫలితం రాకపోతే అస్సలు తట్టుకోలేరు. అలాంటి వారి లిస్ట్ లో చేరతారు దర్శకులు క్రిష్. మాటలోనూ.. నడవడికలోనూ చాలా సాఫ్ట్ గా ఉన్నట్లుగా కనిపిస్తారు క్రిష్.

అయితే.. తాను అనుకున్నది అనుకున్నట్లు రాకపోతే అస్సలు రాజీ పడరని.. అందుకోసం ఎంతైనా విసిగిస్తారేకానీ.. తాను మాత్రం విసిగిపోని ఒక ఆసక్తికర ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. తన మాటలతో తెలుగు ప్రేక్షకుల్ని.. టాలీవుడ్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ఇప్పటికే అతడి మాటలు మ్యూజిక్ లా ఉంటాయన్న పేరున్నప్పటికీ.. తాజా శాతకర్ణిలో తన మాటల విశ్వరూపాన్ని ప్రదర్శించారాయన.

దర్శకులు క్రిష్ కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు బుర్రా. ఏదైనా చెప్పిన తర్వాత.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా రాకుంటే.. ఎంతకూ రాజీ పడని తత్వం క్రిష్ దని చెబుతూ.. ‘‘కృష్ణం వందే జగద్గురుం’’ సినిమాకు అంతా మంచి మాటలే కుదిరాయి కానీ..ఒక సీన్ కు మాత్రం అనుకున్నట్లు మాటలు కుదర్లేదు. ఆ సన్నివేశానికి 30 వెర్షన్లు రాశా. అయినా క్రిష్ కు నచ్చలేదు. చివరకు ఆ ఒక్క సీన్ వదిలేసి మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. చివరకు నా పరిస్థితి ఎలా తయారైందంటే.. నా మీదనే నాకు విరక్తి కలిగే పరిస్థితి’’

‘‘పేపర్ లో వార్తులు చదివి కోపమొస్తుంది. కానీ.. ఇవాల్టి పేపర్ రేపు రాదు. ఇవాల్టికోపం రేపు ఉండదు అని చెబుతాడు. అతడు చెప్పేమాటలు నిజాలే అయినా.. అందులో నిజాయితీ లేదని తెలిసేలా హీరోయిన్ ఒక మాట చెప్పాలి. దీనికోసం ఎన్ని రాసినా ఫలితం లేని పరిస్థితి. చివరికి విసిగిపోయిన తర్వాత రాసిందేమిటంటే.. ‘‘అమ్మ తొమ్మిది నెలలు కష్టపడి మోస్తే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు.. నాన్న పక్కన పది నిమిషాలు సుఖపడితే పుట్టామని అనుకుంటారుకొందరు. రెండు నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసినోడు మనిషవుతాడు. పడక సుఖం చూసినోడు పశువవుతాడు’ అని రాశా. దాన్ని తీసుకెళ్లి క్రిష్ కి చూపించా. ఇదే నాక్కావాల్సిందని ఓకే చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. బుర్రా చెప్పిన మాట చెబితే సాఫ్ట్ గా కనిపించే క్రిష్ ఎంతటి పని రాక్షసుడో.. ఎంతకూ రాజీ పడడన్న విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/