Begin typing your search above and press return to search.

‘సర్దార్’కు అతడి డైలాగ్స్ సూటవుతాయా?

By:  Tupaki Desk   |   22 March 2016 7:30 PM GMT
‘సర్దార్’కు అతడి డైలాగ్స్ సూటవుతాయా?
X
సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటన్నది ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. ఈ చిత్రానికి పవన్ కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. బాబీ కేవలం డైరెక్షన్ మాత్రమే చేశాడు. ఐతే పవన్ కు, బాబీకి మధ్య గ్యాప్ ఫిల్ చేసిన వ్యక్తి ఇంకొకరున్నారు. అతనే సాయిమాధవ్ బుర్రా. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు స్క్రిప్టు సహకారం అందించడంతో పాటు.. ఈ చిత్రానికి మాటల సాయం కూడా చేశాడు సాయిమాధవ్. ఆడియో వేడుకకు అతిథిగా వచ్చి.. పవన్ కోసం తాను రాసిన ‘‘ఆయన ఓన్ అవ్వాలంటే ఆయనికి ట్యూన్ అవ్వాలి.. లేదా ఫ్యాన్ అవ్వాలి’’ అనే డైలాగ్ కూడా వినిపించాడు సాయిమాధవ్.

ఐతే ఈ డైలాగ్ వరకు ఓకే కానీ.. మామూలుగా అయితే సాయిమాధవ్ స్టయిల్ వేరు. కృష్ణం వందే జగద్గురుం - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - గోపాల గోపాల - కంచె సినిమాల్లో మనసుకు హత్తుకునే అద్భుతమైన మాటలు రాశాడు. అవసరం లేకున్నా.. ఆర్టిఫిషియల్ గా మాటలు రాయడం.. పంచ్ డైలాగుల కోసం పాకులాడ్డం.. లాంటివి చేయడం సాయిమాధవ్. సన్నివేశాలకు తగ్గట్లు పొదుపుగా.. అర్థవంతమైన మాటలు రాస్తాడు. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీరు చూస్తే.. ఇదంతా పంచ్ డైలాగుల మీద.. అభిమానుల్ని ఉర్రూతలూగించే డైలాగ్స్ మీద నడిచే సినిమాలా కనిపిస్తోంది. ఇలాంటి సినిమాకు సాయిమాధవ్ మాటలు సూటవుతాయా అన్నది కొంచెం డౌటుగా ఉంది. ‘గోపాల గోపాల’ సినిమా సందర్భంగా సాయిమాధవ్ టాలెంట్ చూసి ‘సర్దార్..’లో అవకాశం ఇచ్చాడు పవన్. సాయిమాధవ్ చేస్తున్న తొలి ఫక్తు కమర్షియల్ సినిమా ఇదే. మరి ఈ సినిమాతో అతనెలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.