Begin typing your search above and press return to search.

క‌త్తిలాంటోడు కి సాయం చేస్తున్న క్లాసిక్ రైటర్!

By:  Tupaki Desk   |   18 July 2016 11:30 AM GMT
క‌త్తిలాంటోడు కి సాయం చేస్తున్న క్లాసిక్ రైటర్!
X
`కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్` చిత్రంతో డైలాగ్ రైట‌ర్‌ గా త‌న స్టామినా ఏంటో చూపించారు రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్‌. గోపాల గోపాల‌ - మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు - కంచె... లాంటి క్లాసిక్ సినిమాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ ర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకున్నారు. బాహుబ‌లి చిత్రానికి తొలుత డైలాగ్ రైట‌ర్‌ గా సాయిమాధ‌వ్ పేరే వినిపించింది. చివ‌రి నిమిషంలో ఏమైందో అత‌డు త‌ప్పుకున్నాడు. అటుపై వ‌రుస‌గా స్టార్ హీరోల సాన్నిహిత్యంతో టాప్ క్లాస్ మూవీస్‌ కి రైట‌ర్‌ గా ప‌నిచేస్తూ బిజీ అయిపోయాడు.

ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స్వ‌యంగా పిలిపించుకుని త‌న క్లాసిక్ హిట్ మూవీ `గోపాల గోపాల‌`కి డైలాగ్స్ రాయించుకున్నారు. ఆన్‌ సెట్స్ అత‌డి ఇన్విజిలేష‌న్‌ ని ఆహ్వానించారు ప‌వ‌న్‌. అంత‌టి స్టామినా ఉన్న రైట‌ర్ కాబ‌ట్టే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంత‌టివారే స్వ‌యంగా సాయిమాధ‌వ్‌ ని త‌న సినిమాకి ప‌నిచేయ‌మ‌ని ఆహ్వానించ‌డం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్ అయ్యింది. మెగాస్టార్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా న‌టిస్తున్న `క‌త్తిలాంటోడు` సినిమాకి బుర్రా సాయిమాధ‌వ్ కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు రాయాల్సిందిగా చిరు పిలుపునిచ్చారు. ఈ సినిమాలో అత్యంత కీల‌క‌మైన ఆరేడు స‌న్నివేశాల్ని అత‌డి చేత రాయించేందుకు చిరు ప్లాన్ చేసి సాయిమాధ‌వ్‌ ని పిలిపించారుట‌. ఆ ఆరేడు సీన్స్ సినిమాకి అత్యంత కీల‌కం అని తెలుస్తోంది.

వాస్త‌వానికి ఈ చిత్రానికి ప‌రుచూరి సోద‌రులు ర‌చ‌యిత‌లుగా ప‌నిచేస్తున్నారు. టైటిల్ కార్డ్స్‌లోనూ వారి పేరే క‌నిపిస్తుంది. కానీ సినిమాకి అత్యంత కీల‌క‌మైన సన్నివేషాలను సాయిమాధ‌వ్ నే రాస్తున్నార‌ని చిత్ర‌యూనిట్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. చూడాలి.. ఆ సన్నివేషాలు కత్తిలాంటోడికి ఏమాత్రం ఉపయోగపడతాయో?!