Begin typing your search above and press return to search.

గరంతో సాయికుమార్‌ ఏమైపోతాడో!!

By:  Tupaki Desk   |   14 Nov 2015 5:30 PM GMT
గరంతో సాయికుమార్‌ ఏమైపోతాడో!!
X
డైలాగ్ కింగ్ సాయికుమార్ యాక్టర్ గా, హీరోగా సత్తా చాటేశాడు. తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. రీసెంట్ గా విలన్ గా కూడా టర్నింగ్ ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు సాయికుమార్. తన కొడుకు ఆదిని హీరోగా సినిమా తీసేస్తున్నాడు. అయితే.. ప్రొడ్యూసర్ గా మాత్రం భార్య సురేఖ పేరు పెట్టాడు లెండి.

గరం అంటూ ఓ మూవీ తీస్తున్నాడు సాయికుమార్. ఆదికి జంటగా ఆదా శర్మ నటిస్తోంది ఈ సినిమాలో. ఇది పూర్తి కమర్షియల్ మూవీనే అయినా.. ఇందులో ఉండే నావెల్ పాయింట్ కారణంగా, హీరోగా తనకు, నిర్మాతగా తండ్రికి ఇది లాభం చేస్తుందంటున్నాడు ఆది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడక్షన్ రిస్కే అయినా.. తనే తండ్రిని ఒప్పించి మరీ సినిమా తీయించానని చెబ్తున్నాడీ కుర్ర హీరో. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే సినిమా తియ్యడం వేరు.. దానిని అమ్మేసుకోవడం వేరు. ఈ విషయం ఇన్నేళ్ల కెరీర్ లో సాయి కుమార్ కి బాగానే తెలిసి ఉంటుంది. దీనికి తోడు బడా, మెగా నిర్మాతల సాయం సాయికుమార్ కి ఉండనే ఉంటుంది. ప్రాజెక్ట్ కరెక్ట్ వస్తే మాత్రం.. రిలీజ్ కి ముందే లెక్క తేలిపోతుంది. కాస్త అటూ ఇటూ అయితే మాత్రం రిస్క్ మాత్రం ఉంటుంది.

అందుకే కమర్షియల్ హంగులు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్ మదన్. ఫారిన్ లో పాటలు తీయడం, హీరోయిన్ తో అందాలు ఒలికించడం లాంటి ఎలిమెంట్స్ ని చక్కగా మిక్స్ చేసేశారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన గరం.. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి సాయికుమార్ కి గరం చేతులు కాల్చుతుందో.. జేబు బరువు పెంచుతుందో.